పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈనెల 17న ఈ సినిమా విడుదల కాన్న్ను సందర్భంగా డైరెక్టర్ నీరజ కోన మీడియాతో ముచ్చటించారు. నాకు స్కూల్ డేస్ నుంచి రైటింగ్ ఇష్టం. పోయెట్రీలో ఒక పుస్తకం కూడా పబ్లిష్ చేశాను. నానిలాంటి స్నేహితులు చాలా సపోర్ట్ చేశారు. ఒక దశలో సినిమాకి కథ రాయగలనే నమ్మకం కుదిరింది. అలా రాసుకున్న కథల్లో ఒకటి.. ‘తెలుసు కదా’. నేను సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయలేదు. దాదాపుగా వంద సినిమాలకి కాస్ట్యూమ్ డిజైన్ చేశాను. ‘పులి మేక’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నితిన్‌ని కలిసాను. అప్పుడు ఈ ఐడియా చెబితే, ఈ కథకు సిద్దు అయితే బాగుంటుందని చెప్పారు. సిద్దుకి కథ చెబితే, సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశారు.
అది నా జీవితంలో మర్చిపోలేని మూమెంట్. ఇది ఒక లవ్ స్టోరీ. ప్రేమ కథతో పాటు ఒక కాంప్లెక్స్ సిటీ కూడా ఉంది. ఇది క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. ఇందులో మూడు క్యారెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ హానెస్ట్‌గా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ ఎమోషనల్‌గా మీకు కనెక్ట్ అవుతుంది. సిద్దు అద్భుతమైన పెర్ఫార్మర్. వరుణ్ క్యారెక్టర్‌లో మెస్మరైజ్ చేశారు. శ్రీనిధి చేసిన రాగ చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్. అంజలి క్యారెక్టర్‌లో రాశి చాలా అద్భుతంగా నటిచింది. తనది చాలా యూనిక్ క్యారెక్టర్. తమన్ మ్యూజిక్ మా సినిమాకి బ్యాక్ బోన్. పాటలన్నీ మంచి హిట్ అయ్యింది. రాబోతున్న పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. నిర్మాతలు విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సపోర్ట్‌ని మర్చిపోలేను. ఎక్కడా రాజీపడకుండా సినిమా నిర్మించారు. ఒక హార్డ్ హిట్టింగ్ లవ్ స్టొరీ చేయబోతున్నా. త్వరలోనే ఎనౌన్స్ చేస్తాం.
హానెస్ట్ ఎమోషన్స్ ఉన్న సినిమా
- Advertisement -
- Advertisement -