– ఊరిని ఊడ్చే ది పంచాయితీ సిబ్బందే
– విధులకు సిబ్బంది లేరు
– నిర్వహణకు నిధులు లేవు
– మున్సిపాల్టీ కధా కమామీషు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజాప్రతినిధులు వారి ఆలోచనలకు తగ్గట్టు పరిపాలన సాగించడానికి విధానాలు రూపొందిస్తారు. అవి అమలుకు ప్రణాళికలు సిద్దం చేస్తారు. కానీ అధికారులు అమలు చేయాలంటే నిధులు ఉండవు,విధులకు సిబ్బంది ఉండరు. నియోజకవర్గంలోని అయిదు మండలాల్లోని నియోజక వర్గం కేంద్రంగా ఉన్న అశ్వారావుపేట మండలంలో మండల కేంద్రంగా ఉన్న అశ్వారావుపేట ను ప్రస్తుత ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మున్సిపాల్టీ గా చేయడానికి కృషి చేసారు అదే పనిగా 25 జనవరి 2025 న మూడు పంచాయితీలను మున్సిపాల్టీ గా రూపొందిస్తూ జీవో ను తీసుకొచ్చారు.నాటి నుండే మేజర్ పంచాయితీ గా ఉన్న అశ్వారావుపేట పురపాలక సంఘంగా నామకరణం చేసారు అధికారులు.
30 వేలు జనాభాతో 6 వేల గృహాలు తో 22 వార్డులు గా ప్రస్తుతం అశ్వారావుపేట గ్రేడ్ 3 పురపాలక సంఘం గా ఉనికిలోకి వచ్చింది. అయితే మున్సిపాల్టీ జీవో తో పాటు అందులోనే తాత్కాలిక మున్సిపల్ కమీషనర్, ఏఈ,టీపీఓ లను ఇంచార్జి గా కేటాయించారు. ప్రస్తుతం రెగ్యులర్ కమీషనర్ ఒకరు మాత్రమే ఉన్నారు. ఏఈ, టీపీఓ, జేఏఓ ఉన్నప్పటికీ ఏఈ పాల్వంచ, అశ్వారావుపేట, టీపీఓ సత్తుపల్లి, మధిర, అశ్వారావుపేట, జేఏఓ సత్తుపల్లి,అశ్వారావుపేటల్లో అదనపు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ పంచాయితీ సిబ్బందే మున్సిపాల్టీ అధికారుల విధులు నిర్వహిస్తున్నారు.
మున్సిపాల్టీలో మున్సిపాల్టీ కమీషనర్ క్రింద ప్రధానంగా అయిదు విభాగాలు ఉంటాయి.
1)ఇంజినీరింగ్,2)టౌన్ ప్లానింగ్,3)రెవిన్యూ,4)పారిశుధ్యం,5)అకౌంట్స్.
ఇంజనీరింగ్ విభాగంలో ఏఈ,వర్క్ ఇన్స్పెక్టర్,వాటర్ సప్లై,పవర్ సప్లై,ఇతర అభివృద్ధి ఉప విభాగాలు,వాటికి సిబ్బంది ఉంటారు. టౌన్ ప్లానింగ్ లో టీపీఓ,టీపీఎస్,టీపీబీఓ,చైన్ మేన్ ఉంటారు. రెవిన్యూ విభాగంలో మేనేజర్,ఆర్ఐ,బీసీ లు ఉంటారు.ఈ విభాగంలో నే ఉప విభాగంగా మెప్మా,డీఎంసీ,ఏడీఎంసీ,టీఎంసీ,ఆర్పీ స్ ఉంటారు. పారిశుధ్యం విభాగంలో ఎస్ఐ (శానిటేషన్ ఇన్స్పెక్టర్),హెచ్ ఏ (హెల్త్ అసిస్టెంట్),జువాన్ లు, పారిశుధ్య కార్మికులు ఉంటారు. అకౌంట్స్ విభాగంలో జేఏఓ,జూనియర్ ఎకౌంటెంట్,సీనియర్ ఎకౌంటెంట్ ఉంటారు. ఇన్ని విభాగాలు,ఇంతమంది సిబ్బంది అవసరం ఉండగా ప్రస్తుతం రెగ్యులర్ కమీషనర్ ఒకరు,పూర్వ పంచాయితీ పూర్వ సిబ్బంది బిల్ కలెక్టర్ లు,పారిశుధ్య కార్మికులు మాత్రమే ఉన్నారు.
విధులు నిర్వహించడానికి సిబ్బంది ఎలాగూ లేరు మరి నిధులు ఏమైనా ఉన్నాయా అంటే అవీ లేవు.ఎందుకంటే పంచాయితీ పాలక వర్గాలు లేక కేంద్రం నిధులు ఇవ్వలేదు.పంచాయితీ పాలక వర్గాలు కాలం చెల్లి సంవత్సరం అయ్యాక అశ్వారావుపేట మున్సిపాల్టీ గా రూపొందింది.దీంతో కోశాగారం ఖాలీ గా ఉంది.ఇటీవల కొత్త పురపాలక లకు పరిపాలనా నిమిత్తం రూ.15 కోట్లు మంజూరు అయినప్పటికీ మున్సిపాల్టీ ఎకౌంట్ జమ కాలేదు. మున్సిపాల్టీ ఏర్పడి ఏడు నెలలు పూర్తి అయినప్పటి సిబ్బంది పోస్ట్ లు మంజూరు కాలేదు, నిధులు జమ కాలేదు. దీంతో పారిశుధ్యం సరిగా లేదు.
ఇప్పటికైనా సిబ్బంది పోస్ట్ లు మంజూరు చేయాలని,నిధులు మంజూరు చేయాలని పట్టణ ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇదే విషయం అయి కమీషనర్ నాగరాజు ను వివరణ కోరగా సిబ్బంది పోస్ట్ లు ప్రభుత్వం మంజూరి చేయాలి, నిధులు కేటాయించాలి. కొత్తగా ఏర్పడిన పురపాలక సంఘాలకు అన్నిటికీ ప్రభుత్వం సిబ్బందిని కేటాయిస్తుంది. నిధులు మంజూరు చేస్తుంది అన్నారు.