Tuesday, April 7, 2026
E-PAPER
Homeసినిమాసరికొత్త అనుభూతినిచ్చే మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌

సరికొత్త అనుభూతినిచ్చే మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌

- Advertisement -

ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తెరకెక్కిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఎం4ఎం’. ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కానుంది. అమెరికన్‌ నటి జో శర్మ, సాంబీత్‌ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ పాన్‌ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్‌ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్‌ మీడియా క్రియేషన్స్‌ బ్యానర్‌పై, మెక్‌విన్‌ గ్రూప్‌, యూఎస్‌ సహకారంతో రూపొందించారు. భారతదేశంలో ఈ చిత్రాని పీవీఆర్‌ ఐనాక్స్‌ సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనుంది. అమెరికాలో విడుదల బాధ్యతలను టెక్‌ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఉత్తర భారత విడుదలను జేవీఎల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం పాన్‌-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. థియేటర్లలో విడుదలకు ముందే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది.

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా పలాసీస్‌ సి థియేటర్‌లో ప్రైవేట్‌ స్క్రీనింగ్‌ నిర్వహించగా, ముంబైలోని ఇప్రా ప్రీవ్యూ థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలకు సినీ వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. ఇక హీరోయిన్‌ జో శర్మ అమెరికా, భారత్‌లో విస్తృతంగా నిర్వహించిన ప్రమోషన్‌ టూర్‌ చిత్రానికి మరింత ప్రచారం తీసుకువచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు-నిర్మాత మోహన్‌ వడ్లపట్ల మాట్లాడుతూ, ‘మే 8న ఈ సినిమాను పాన్‌ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నాం. విడుదలకు ముందే మా సినిమా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడటం గర్వంగా ఉంది. సినిమా ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. థ్రిల్లింగ్‌ కథనం, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’ అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉత్కంఠభరిత అనుభూతికి గురిచేసే మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రత్యేక గుర్తింపు పొందుతుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -