పాలకుర్తి నియోజకవర్గం నవతెలంగాణ ప్రచురించిన ప్రత్యేక సంచిక..
ఆవిష్కరణలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
కార్మిక, కర్షకుల పక్షపాతిగా నవతెలంగాణ పనిచేస్తుందని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు అన్నారు. నవతెలంగాణ ప్రచురించిన పాలకుర్తి ప్రత్యేక సంచికను 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గురువారం మండల కేంద్రంలో గల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి, నవతెలంగాణ ఉమ్మడి వరంగల్ రీజియన్ మేనేజర్ దేవేందర్రావులు ఆవిష్కరించారు. తొర్రూరులో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిలు మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలికితీయడంలో నవతెలంగాణ కృషి అభినందనీయమన్నారు, కార్మిక, కర్షకుల సమస్యలతో పాటు రైతుల సమస్యలను, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను నిర్భయంగా వెలికితీయడంలో నవతెలంగాణ పనిచేస్తుందని తెలిపారు. పేద ప్రజల గుండెచప్పుడుగా, సమస్యలను వెలుగొత్తి చూపడంలో అగ్రభాగాన నవతెలంగాణ పేద ప్రజల, శ్రామిక వర్గాలకు తోడుగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో తనదైన ముద్ర వేసుకున్న నవ తెలంగాణ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, ప్రజా గొంతుకగా నిలవాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వానికి, పేద ప్రజలకు వారధిగా నవతెలంగాణ పనిచేస్తూ పేద ప్రజల, కార్మిక కర్షకుల మన్ననలు పొందడం అభినందనీయమన్నారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంలో నవతెలంగాణ చేస్తున్న కృషిని కొని ఆడారు. ప్రజల సమస్యలను గుర్తిస్తూ, ప్రజల గొంతుకగా నవతెలంగాణ పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, తొర్రూరు విలేకరులు గుగులోతు దేవోజి నాయక్, పరమేశ్వర్, నేతి ఉపేందర్, సదాశివరావు, జనగామ జిల్లా ఇన్చార్జి మాలోతు రాజు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుగ్గిళ్ళ ఆదినారాయణ, గోనే మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్మిక, కర్షకుల పక్షపాతి నవతెలంగాణ ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES