Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుప్రజల సమస్యలపై స్పందించే నవతెలంగాణ

ప్రజల సమస్యలపై స్పందించే నవతెలంగాణ

- Advertisement -

గవర్నమెంట్ ఆఫ్ రైల్వే స్టేషన్, నిజామాబాద్ హౌస్ ఆఫీసర్ సాయిరెడ్డి
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వార్త కథనాలతో ముందుకు వెళ్తున్న దినపత్రిక నవతెలంగాణ. నవతెలంగాణ దినపత్రిక 10వ వార్షికోత్సవ సందర్భంగా పత్రికలో పనిచేస్తున్న సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలకు ఒత్తిడి లోనై రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడడం సరైనది కాదు. అందుకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించడానికి ఉన్నతాధికారులతో చర్చించి ఆత్మహత్యలు చేసుకోకుండా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం. అలాగే రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బంగారు ఆభరణాలు ధరించి ప్రయాణం చేయకుండా ఉంటే దొంగతనాలు అరికట్టవచ్చు అని తెలిపారు. ప్రజల ఎవరికైనా రైల్వే స్టేషన్ పరిధిలో ఎలాంటి సమస్యలు తలెత్తిన 139కి ఫోన్ చేసి సమాచారం అందించాలి. ప్రతి ఒక్కరూ రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకుని ప్రయాణించాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad