Friday, July 11, 2025
E-PAPER
Homeకరీంనగర్హన్మాజీపేటలో నూతన బ్రిడ్జిని త్వరలోనే ప్రారంభిస్తా..

హన్మాజీపేటలో నూతన బ్రిడ్జిని త్వరలోనే ప్రారంభిస్తా..

- Advertisement -

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న విప్ ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ రూరల్ 
: వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలోని నక్క వాగుపై నిర్మించిన నూతన బ్రిడ్జిని త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటుకు తీసుకువస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, స్థానిక నేతలతో కలిసి బాబాను దర్శించుకొని తరించారు. బాబా ఆశీస్సులు ప్రజల అందరిపై ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘ స్వామి యాదవ్, గోవర్ధన్ రెడ్డి, సామ తిరుపతిరెడ్డి, సోయినేని కరుణాకర్, బాలసాని శ్రీనివాస్ గౌడ్, చిలుక ప్రభాకర్, హరి నందన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -