సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా గ్రాండ్‌గా లాంచ్ అవుతున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. టైమ్‌లెస్ కల్ట్ ప్రేమకథగా ఉండబోయే ఈ సినిమా టైటిల్‌ను ప్రీ-లుక్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఆవిష్కరించారు. ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్ పెట్టారు.
పోస్టర్‌లో హీరో చేతులు, అతని లవర్ చేతులు ఒక రస్టిక్ గన్ పట్టుకుని ఉండటం ఆసక్తికరంగా ఉంది. బ్యాక్‌డ్రాప్‌లో పవిత్రమైన తిరుమల ఆలయం, ప్రశాంతమైన శేషాచలం కొండలు సినిమా డెప్త్‌ని ప్రజెంట్ చేస్తున్నాయి. రెండు జీవితాలు – ఒక ప్రయాణం. రెండు చేతులు – ఒక ప్రామిస్. రెండు మనసులు – ఒక విధి. ప్రీ-లుక్ ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంది. ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు. జయ కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని జంటగా నటిస్తున్న ఈచిత్రానికి రచన- దర్శకత్వం: అజయ్ భూపతి, సమర్పణ: అశ్విని దత్, నిర్మాత: పి. కిరణ్, సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్.
సరికొత్త ప్రేమకథ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



