హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న చిత్రం ‘తెలుసు కదా’. అక్టోబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ ‘మల్లికా గంధ’ మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు మేకర్స్ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
టీజర్ ఒక ట్రైయాంగిల్ ప్రేమకథను అద్భుతంగా ప్రజెంట్ చేసింది. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి పాత్రలతో సిద్ధు పాత్ర కాంప్లెక్స్ రిలేషన్ ఆసక్తికరంగా ఉంది. ‘లవ్ యు2’ అనే ట్యాగ్‌లైన్ మరింత క్యూరియాసిటీని పెంచింది. హ్యాపీనెస్, లవ్, కాన్ఫ్లిక్ట్, ఎమోషనల్ మూమెంట్స్‌తో టీజర్ ఆద్యంతం అలరిస్తోంది. నీరజ కోన నేరేటీవ్‌ని చాలా మెచ్యూర్డ్‌గా ప్రజెంట్ చేశారు. ఫన్, డ్రామా అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యాయి. సిద్ధు ఫ్రెండ్‌గా వైవా హర్ష తనదైన హ్యుమర్‌తో ఆకట్టుకున్నాడు. తమన్ మ్యూజిక్ న్యూ ఏజ్ లవ్ స్టొరీ మూడ్‌ని సెట్ చేసింది అని చిత్ర యూనిట్ తెలిపింది.
సరికొత్త ముక్కోణ ప్రేమకథ
- Advertisement -
- Advertisement -