నరేష్ అగస్త్య హీరోగా చైతన్య గండికోట దర్శకత్వంలో డా.ఎం రాజేంద్ర నిర్మాణంలో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. శ్రేయ రుక్మిణి హీరోయిన్. జీఇఎన్‌ఐఇ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కబోయే ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయ్యింది. మాజీ ఐఏఎస్ సునీల్ శర్మ, ఆయన భార్య షాలిని శర్మ మేకర్స్‌కి స్క్రిప్ట్ అందించగా, హీరో శ్రీవిష్ణు క్లాప్ కొట్టారు. రఘుబాబు కెమెరా స్విచాన్ చేయగా, డైరెక్టర్ బి. గోపాల్ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
నరేష్ అగస్త్య, శ్రేయ రుక్మిణి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం- చైతన్య గండికోట, నిర్మాత- డా.ఎం రాజేంద్ర, డీవోపీ- విద్యాసాగర్ చింతా, సంగీతం- మిక్కీ జె మేయర్, ఆర్ట్- షర్మిలా యెలిసెట్టి, ఎడిటర్- కోటగిరి వెంకటేశ్వరరావు, డైలాగ్ రైటర్- లక్ష్మీ భూపాల, లిరిక్స్- వనమాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- శేఖర్ కందుకూరి.
భిన్న కాన్సెప్ట్‌తో కొత్త సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



