భిన్న పాత్రలు, వైవిధ్యమైన చిత్రాలతో వరలక్ష్మి శరత్ కుమార్ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా తెలుగులో ‘పోలీస్ కంప్లెయింట్’ చిత్రంతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సూపర్‌స్టార్ కష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్రంలోని వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో పాటు, తొలిసారి ఆద్యంతం వినోదాన్ని అందించే పాత్రలో ఆమె నటించడం విశేషం. ఈ చిత్రాన్ని ఎమ్మెస్కె ప్రమిద శ్రీ ఫిలిమ్స్, శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా సంస్థల సంయుక్త బ్యానర్లలో సింగపూర్ బాలకష్ణ, మల్లెల ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, దర్శకుడు సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్నారు. నవీన్ చంద్ర, కష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, అమిత్, దిల్ రమేష్, రాజశ్రీ నాయర్, సింగపూర్ బాలకష్ణ, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీహర్ష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కి స్తున్నాం. మనం చేసే ప్రతి చర్యకి ఫలితంగా అదే తిరిగి మనకే వస్తుందని కాన్సెప్ట్‌తో, హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంగా సరి కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’ అని చెప్పారు. ‘వరలక్ష్మి శరత్ కుమార్ పోషిస్తున్న పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. అలాగే ఈ మూవీలో సూపర్ స్టార్ కష్ణ మీద చేసిన స్పెషల్ సాంగ్ అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. ఈ సినిమాను భారీగా రూపొందిస్తున్నాం. యాక్షన్, హర్రర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేళవించి ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించేలా దర్శకుడు సంజీవ్ మేగోటి అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు’ అని నిర్మాతలు సింగపూర్ బాలకష్ణ, మల్లెల ప్రభాకర్ తెలిపారు.