Saturday, October 25, 2025
E-PAPER
Homeసినిమాకలెక్షన్స్‌తో సరికొత్త రికార్డ్‌

కలెక్షన్స్‌తో సరికొత్త రికార్డ్‌

- Advertisement -

రిషబ్‌ శెట్టి నటించిన ‘కాంతార ఛాప్టర్‌ 1’ బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా 4వ వారం కూడా థియేటర్లలో హౌస్‌ఫుల్‌ షోలతో కొనసాగుతోంది. హౌంబలే ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.818 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.110 కోట్లకు పైగా సాధించడం విశేషం. దీంతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన అనువాద సినిమాగానూ రికార్డు సృష్టించింది. అమెరికాలో కూడా 5 మిలియన్‌ డాలర్‌ మార్క్‌ చేరువలో ఉంది. ఈనెల 31న విడుదల కానున్న ఇంగ్లీష్‌ డబ్‌ వెర్షన్‌ అంతర్జాతీయ ప్రేక్షకుల్ని సైతం మెప్పిస్తుందనే దీమాని మేకర్స్‌ వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -