నవతెలంగాణ – జక్రాన్ పల్లి
నిజాంబాద్ జిల్లా జక్రాంపల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలోని జేఎం కే పి ఎం పసుపు రైతు ఉత్పాదాల సంఘాన్ని నైజీరియా దేశానికి చెందిన పసుపు, అల్లం పండించే రైతు సాహె ఉలెనాన్ సందర్శించారు. స్థానిక జెఎంకెపిఎం చైర్మన్ పాట్కూరి తిరుపతిరెడ్డితో వారి దేశంలో పండే పసుపు పంట గురించి చర్చించడం జరిగినది. నైజీరియాలో నాకు 3,000 ఎకరాల భూమి ఉంది. అందులో దాదాపు 250 ఎకరాలు పసుపు పండిస్తాము.. కానీ భారతదేశంలో తీసిన అంత దిగుబడి తీయలేకపోతున్నాము అన్నారు. మా దేశంలో ఎకరానికి ఎండిన పసుపు ఐదు ఆరు క్వింటాళ్ల కంటే ఎక్కువ రాదు. మీ దగ్గర 20 క్వింటాలపైన ఎల్లుతుంది. ఏమేమి దీనికి కావలసిన మందులు వాడుతారు. ఎలా దీన్ని పండిస్తారు అనే విషయాలు తెలుసుకోవడం జరిగింది.
మా నైజీరియా దేశంలో కూడా మీలాగా పంట దిగుబడి అధికంగా తీయాలంటే ఏం చేయాలని తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అతను మీరు కొంతమంది పసుపు రైతులు మా దేశానికి వచ్చి మాకు సలహా సూచనలు ఇవ్వగలుగుతారా అని అడగడం జరిగింది. అట్లాగే ఈ ప్రాంతంలో పసుపు పండించే రైతులు ప్రపంచ దేశాలకు కూడా ఇక్కడి పసుపును ఎగుమతి చేస్తున్నారని తెలిసింది. మరి మా నైజీరియా దేశానికి కూడా మీరు పండించే పంట అధిక దిగుబడి వెళ్తుంది కావున మీయొక్క విత్తనాన్ని సరఫరా చేయగలుగుతారా చేయండి అని విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే రానున్న భవిష్యత్తులో పసుపు పంటలో అధిక దిగుబల్లు సాధించడానికి మీ యొక్క సహాయ సహకార కావాలని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో హైదరాబాద్ వారి బెస్ట్ ఇంజనీరింగ్ కంపెనీ అధిపతి పవన్ శేష సాయి, జేఎంకే పిఓ చైర్మన్ పాటుకూరి తిరుపతి రెడ్డి పాల్గొనడం జరిగింది.



