Saturday, March 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వాలి

20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వాలి

- Advertisement -

– బీఆర్‌ఎస్‌ నాయకులు రాకేశ్‌రెడ్డి డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న 20వేల ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో నిరుద్యోగ యువత గురించి, ఉద్యోగాల నోటిఫి కేషన్ల గురించి ప్రస్తావించలేదని అన్నారు. జీవో 46, జీవో 29 రద్దు మీద అసెంబ్లీలో ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఎకరం సర్వే చేస్తే కేవలం రూ.10 మాత్రమే ఇవ్వడంపై పునరాలోచన చేసి, పెంపుపై ప్రకటన చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతభత్యాలపై విద్యా కమిషన్‌ చైర్మెన్‌ ఆకునూరి మురళి చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ ప్రక్షాళన పేరుతో ఇచ్చిన నివేదికలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తొలగించాలని అనటం నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను విద్యకు దూరం చేయాలన్న కుట్రనే అవుతుందని చెప్పారు. నిరుద్యోగ అంశాలపై ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయకుంటే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచనలతో ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -