Friday, July 18, 2025
E-PAPER
Homeఖమ్మంసత్ఫలితాలు ఇచ్చిన బడిబాట..

సత్ఫలితాలు ఇచ్చిన బడిబాట..

- Advertisement -

పెరిగిన విద్యార్థుల చేరికలు..
గతేడాది కంటే 270 మంది పెరుగుదల….
అత్యధిక విద్యార్ధులు తో జెడ్పీహెచ్ఎస్ అశ్వారావుపేట..
ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయుల కృషి అమోఘం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
: పాలకులను బట్టి పరిపాలన ఉంటుంది. ప్రభుత్వం లక్ష్యాన్ని బట్టి అధికారులు పనిచేస్తారు అనడానికి పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట మంచి ఉదాహరణ. తెలంగాణ ప్రభుత్వాధినేతగా పాఠశాల విద్యాభివృద్ధి పై దృష్టి పెట్టడంతో పాటు ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే యోచన చేయడం ఒక ఎత్తు అయితే.. ఏడాదికి ఏడాది ఊరు బడుల్లో విద్యార్ధుల చేరికలు తగ్గిపోతున్న క్రమంలో ఉపాద్యాయ పోస్ట్ లకు ఎసరు వస్తుందనే ఆవేదనలో ఉపాద్యాయులు సైతం ప్రభుత్వ బడుల్లో విద్యార్ధుల చేరికలు పై నిర్విరామ కృషి సత్ఫలితాలను ఇచ్చిందనే చెప్పుకోవాలి.

ఎంఈఓ పొన్నగంటి ప్రసాదరావు తెలిపిన వివరాలు ప్రకారం గతేడాది కంటే ఈ ఏడాది 200 మంది విద్యార్ధులు నూతనంగా చేరారు. మండలంలో మండల పరిషత్,జిల్లా పరిషత్ ల ఆద్వర్యంలో మొత్తం 64 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో గతేడాది విద్యాసంవత్సరం పాఠశాల  చివరి పని దినం నమోదు అయిన హాజరు ప్రకారం బాలురు 1819,బాలికలు 1501 మంది మొత్తం 3320 మంది బాలబాలికలు విద్యను అభ్యసించ గా ఈ ఏడాది విద్యాసంవత్సరం 10 జులై నాటికి నమోదు అయిన హాజరు ప్రకారం బాలురు 1905 మంది,బాలికలు 1555 మంది మొత్తం 3520 మంది బాలబాలికలు విద్యను అభ్యచిస్తున్నారు.ఈ లెక్క ప్రకారము గతేడాది కంటే ఈ ఏడాది బాలురు 146 మంది,బాలికలు 54 మంది మొత్తం  200 మంది విద్యార్ధిని విద్యార్ధులు నూతనంగా ప్రభుత్వ బడుల్లో చేరారు.

మండలంలోని స్థానిక సంస్థలకు చెందిన 64 బడుల్లో  జెడ్పీహెచ్ఎస్( బాలురు) పాఠశాల 526 (383 + 143) మంది విద్యార్ధిని విద్యార్ధులతో అత్యధిక విద్యార్ధులు ఉన్న పాఠశాలగా ప్రధమ స్థానంలో ఉండగా,రెండో స్థానంలో 168 (105 + 63) మంది విద్యార్ధిని విద్యార్ధులు తో ఎంపీయూపీఎస్ ఆసుపాక ఉంది.పీఎం శ్రీ ఎంపీయూపీఎస్ నారం వారి గూడెం 164 (86 + 78) విద్యార్ధిని విద్యార్ధులతో మూడవ స్థానంలో నిలిచింది.

ఇక చివరి స్థానంలో కేవలం 3 (2 + 1) ముగ్గురు విద్యార్ధులతో ఎంపీపీ ఎస్ రమణక్కపేట కునారిల్లుతుంది.విశేషం ఏమిటి అంటే గతేడాది ఈ ఏడాది ముగ్గురే విద్యార్ధులు ఉండటం విచారకరం.గమనార్హం. ఇక పోతే ప్రభుత్వ బడిని బలోపేతం చేయడమే తమ లక్ష్యం అడుగులు వేసి బడిబాట ను విజయవంతం చేయడంలో ఎంఈఓ ప్రసాదరావు తో పాటు ఆయా పాఠశాలల ఉపాద్యాయులు విజయం సాధించారు. సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా ఎలాగైనా సాధించవచ్చునని అశ్వారావుపేట ఉపాధ్యాయులు, ఉపాధ్యాయు రాళ్ళు ఆచరణలో చేసి నిరూపించారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఈనెల మే 6 నుంచి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు

ఎంఈఓ ప్రసాదరావు,జెడ్పీ హెచ్ ఎస్  ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయులు ప్రయివేటు పాఠశాలలకు వెళుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు.ప్రభుత్వ పాఠశాలలో విలువైన నాణ్యమైన, క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన చేస్తున్నామని తల్లిదండ్రులకు వివరించారు.కనీసం మూడు నెలల పాటు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించండి.మా విద్యా బోధనను పరిశీలించండి. మీకు నమ్మకం కుదిరితే, నచ్చితే మీ పిల్లలను ఉంచండి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులలో చైతన్యం కల్పించారు.దీంతో చాలామంది విద్యార్థులు ఉపాద్యాయులు

చెప్పిన మాటలను, వారు చేస్తున్న కృషిని నమ్మి తమ పిల్లలను ప్రయివేటు పాఠశాల నుంచి మాన్పించి ప్రభుత్వ పాఠశాలలకు పంపించారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి చేరారు. ఈ విధంగా ఉపాధ్యాయులు ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -