Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్పేదల పక్షాన ప్రజా ప్రభుత్వం ఉంటుంది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

పేదల పక్షాన ప్రజా ప్రభుత్వం ఉంటుంది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

- Advertisement -

నవతెలంగాణ – రుద్రంగి
పేదల పక్షాన ప్రజా ప్రభుత్వం ఉంటుందని,రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం రుద్రంగి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆవరణలో రుద్రంగి మండల పరిధిలో 4 లక్షల 37 వేల విలువ గల 13 ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయానికి ద్వారా పేద ప్రజలకు చికిత్స అనంతరం ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని, అలాగే మన ప్రాంతంలో ఎల్ఓసిల ద్వార అనేకమంది ప్రజలకు అనారోగ్య సమస్యలకు చికిత్స అందించడం జరిగిందని తెలిపారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్, సన్నం బియ్యం పంపిణి,500 సిలిండర్, ఆడవారికి ఉచిత ఆర్టీసి బస్సు ప్రయాణము, పదేళ్లు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ఇందిరమ్మ నిర్మాణాలను పూర్తి అవుతున్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 18 నేలలో సుమారు1 లక్ష కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఎరువుల కు సంబంధించిన ప్రతి గ్రామంలో వ్యవసాయదారులు వేసిన పంటల ఆధారంగా ఎరువులు పంపిణీ చేయడం జరుగుతుందని, రైతులకు ఏదైనా ఇబ్బంది తెలెత్తితే వారికి సూచనలు సలహాలు ఇవ్వాలి కానీ కావాలని కొందరు ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకు వస్తున్నారని అలా చేయడం సరికాదు అన్నారు.

నాగారం చెరువు ప్రాజెక్టు ఎల్లయ్య ఫెడర్ చానల్ కాలువ మరమ్మత్తుకు 15 లక్షల 37 వెలు మంజూరు చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి,మాజీ జడ్పీటీసీ గట్ల మినయ్య,మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్,నాయకులు ఎర్రం గంగానర్సయ్య,గండి నారాయణ,పల్లి గంగాధర్,సామ మోహన్ రెడ్డి,తర్రె లింగం,దయ్యాల శ్రీనివాస్,అక్కేనపెల్లి శ్రీనివాస్, యాదయ్య,దువ్వకా గంగాధర్,రాజలింగం, నర్సయ్య,అశోక్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad