Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ జూనియర్ కళాశాలకు శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేస్తా..

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేస్తా..

- Advertisement -

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు శాశ్వత నూతన భవనాన్ని ఏర్పాటు చేయిస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. గురువారం నాగిరెడ్డిపేట్ పర్యటనలో భాగంగా నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని ప్రస్తుతం జూనియర్ కళాశాల తాత్కాలిక భవనంలో కొనసాగుతుందని శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేయిస్తానని ఆయన అన్నారు.  కళాశాలలో ప్రస్తుతం పూర్తిస్థాయి ఫ్యాకల్టీ రావడం జరిగిందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ సీటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఆయన వెంట జూనియర్ కళాశాల నోడల్ ఆఫీసర్ షేక్ సలాం, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి, డిబేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస రెడ్డి, మైనార్టీ మండల అధ్యక్షుడు ఇమామ్, కోఆర్డినేటర్ నరసింహారెడ్డి, వెంకటరామిరెడ్డి గ్రామ అధ్యక్షుడు పురపతి శేఖర్, నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు గులాం హుస్సేన్, సురేందర్ గౌడ్, శ్రీరామ్ గౌడ్, సాయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -