భూతగాదాలే హత్యకు కారణం…?
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి రూరల్ పరిధిలోని వడపర్తిలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గత మంగళవారం సాయంత్రం తోటకూరి భాను అనే వ్యక్తిని వడపర్తి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆయనను గొడ్డలితో నరికారు. దీంతో తీవ్ర గాయాల పాలైన ఆయనను సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున 3:30 నిమిషాలకు మృతి చెందడు. అంతకుముందే భూమికి సంబంధించిన పంచాయతీ ఉండటంతో గత మంగళవారం కావాలని పంచాయతీ పెట్టుకుని మృతుని అన్న మల్లయ్యపై తోటకూరి మల్లెష్ తండ్రి బాల నర్సయ్య ఇంకొంత మందితో కలిసి పంచాయతీ పెట్టారు.
తోటకూరి బాలయ్య కుమారుడు అజయ్ మృతుడి మల్లేష్ ను బైక్ మీద ఎక్కించుకుని పంచాయతీ జరిగిన స్థలంలో తీసుకుని వెళ్లగా .. ఉద్దేశ పూర్వకంగానే మల్లేష్ తల్లి శంకరమ్మతో గొడ్డలి తెప్పించుకొని వెనుకనుండి వచ్చి ఎలాంటి సంబంధం లేని భానుపై దాడి చేశారు. దీంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అనంతరం చికిత్స అందించారు.
ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్లు బందువులు తెలిపారు. భాను మృతికి కారణమైన వారందరిపై క్రీమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగ మృతుని భార్య శ్రీలత ఇద్దరు కుమారులు అనిల్ కుమార్, కన్నయ్యలు ఉన్నారు.
వడపర్తి స్టేజి వద్ద రాస్తారోకో… మృతుని భాను కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మహిళలు జగదేవ్పూర్ భువనగిరి ప్రధాన రహదారి వడపర్తి స్టేజి వద్ద రాస్తారోకో నిర్వహించారు.