నవతెలంగాణ – ఆర్మూర్ : అకాల వర్షానికి పంట నష్టం కింద రైతులు పెట్టిన పెట్టుబడి కి ఒకటిన్నర రెట్లు పెట్టిన పెట్టుబడికి కలిపి ఇవ్వాలని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా కు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్ కలెక్టర్కు గత వారం రోజులుగా కురిసిన వర్షానికి సర్వే చేసి రైతులకు నష్టపరిహారం కింద రైతులు పెట్టిన పెట్టుబడికి ఒకటిన్నర రేట్లు కలిపి ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విపత్తు బడ్జెట్ కేటాయించాలని వినతిపత్రం ఇవ్వటం జరిగింది. అనంతరం సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ.. గత వారం రోజులుగా కురిసిన వర్షానికి రోడ్లు, డ్రైనేజీలు కొట్టుకుపోయిన పేదలు నివాసం ఉంటున్నటు వంటి ఇండ్లు దెబ్బతిన్న వాటిని ఆదుకోవాలని అన్నారు.
భీమ్గల్ కప్పల వాగు పక్కన వేసినటువంటి రైతులకి పంట నష్టం ఇరువైపులా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నష్ట పోయిన పంట సర్వే చేసి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సీపీఐ(ఎం) బృందం భీంగల్ లో వరద ప్రభావిత ప్రాంతాన్ని సందర్చిచగా పంట కోల్పోయిన రైతులతో మాట్లాడటం జరిగింది. మైపాల్ అనే రైతు ఏడెకరాల్లో వరి పంట వేయగా దాదాపు 3 ఎకరాలు ఇసుక మేటలు వేసిందని, గంగాధర అనే రైతు నాలుగరాలు వరి పంట వేయగా ఇసుక మేటలు వేసిందని,కలెక్టర్ అనే రైతు మొక్కజొన్న మొత్తం పడిపోయి నేలపై వాలిందని అన్నారు అప్పల వాగు ఇరువైపులా పంట నష్టం జరిగిన రైతులకు ఆరుగాలం కష్టపడి పంట పండించిన ఫలితం లేదు ఒక నెల రోజులైతె పంట చేతికి వచ్చే సమయంలో నష్టం జరిగిందని రైతులు వాపోయారని అన్నారు ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పూతాడి ఎల్లయ్య డివిజన్ కమిటీ సభ్యులు బొర్రా నాగరాజు, బి రవి రాజన్న రైతులు నర్సారెడ్డి, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.