Friday, May 23, 2025
Homeసినిమాఫుల్‌ మీల్స్‌ లాంటి చిత్రం

ఫుల్‌ మీల్స్‌ లాంటి చిత్రం

- Advertisement -

విజయ్ సేతుపతి హీరోగా ‘ఏస్‌’ అనే చిత్రం నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శక, నిర్మాత అరుముగ కుమార్‌ ఈ మూవీని 7సిఎస్‌ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడిగా రుక్మిణి వసంత్‌ నటించారు. ఈ సినిమాను శ్రీ పద్మిని సినిమాస్‌ బ్యానర్‌ మీద బి. శివప్రసాద్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో శ్రీ పద్మిని సినిమాస్‌ అధినేత దర్శక, నిర్మాత బి. శివ ప్రసాద్‌ మాట్లాడుతూ, ”ఈ సినిమా ఆల్రెడీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయినట్టు కనిపిస్తోంది. అందరి మొహాల్లో సంతోషం ఉంది. ఈ కథ, క్యారెక్టర్స్‌ అన్నీ అద్భుతంగా ఉండ బోతున్నాయి. విజయ్ సేతుపతి మళ్లీ అందరినీ ఆకట్టు కోబోతున్నారు. ఆయనతో ‘రొమాంటిక్‌ డాన్‌’ అనే సినిమాను త్వరలోనే ప్రకటిస్తాను. ఈ చిత్రం పెద్ద విజయం సాధించబోతోంది’ అని అన్నారు.
‘అరుముగ కుమార్‌ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. నాకు సినిమాలో మొదటి చాన్స్‌ ఇచ్చింది కూడా ఆయనే. మళ్లీ ఇప్పుడు ఆయనతో పని చేయటం ఆనందంగా ఉంది. ఇందులో యాక్షన్‌, రొమాన్స్‌ అన్నీ అంశాలు ఉంటాయి. ఈ మూవీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. తెలుగు డబ్బింగ్‌ చాలా బాగా ఉంది. బి. శివప్రసాద్‌ మల్టీ టాలెంటెడ్‌. ఆయనకు ఆల్‌ ది బెస్ట్‌. మా సినిమాను అందరూ చూసి సక్సెస్‌ చేయండి’ అని విజయ్ సేతుపతి చెప్పారు.
దర్శక, నిర్మాత అరుముగ కుమార్‌ మాట్లాడుతూ, ‘యాక్షన్‌, రొమాన్స్‌, ఫన్‌ ఇలా అన్నీ రకాల ఎలిమెంట్స్‌ ఇందులో ఉంటాయి. అన్ని కమర్షియల్‌ అంశాలతో ఫుల్‌మీల్స్‌లా ఈ చిత్రం ఉంటుంది. విజరు సేతుపతి ఆల్‌ రౌండర్‌. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది’ అని తెలిపారు. ‘ఈ చిత్రంలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది’ అని దివ్యా పిళ్లై తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -