తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు 2025’లో ‘దండోరా’ సత్తా చాటుకుంది. మూడు కేటగిరీల్లో ‘దండోరా’ అవార్డుల్ని కొల్లగొట్టేసింది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ నిర్మాణంలో మురళీకాంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శివాజీ, నవదీప్, నందు, రవికష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ముఖ్య పాత్రల్ని పోషించారు. తమ సినిమాకు ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు, ఇచ్చిన గుర్తింపు సందర్భంగా ఆదివారం చిత్రయూనిట్ థ్యాంక్స్ చెబుతూ మీడియా సమావేశం నిర్వహించింది.
శివాజీ మాట్లాడుతూ,”మా సినిమాని గుర్తించి అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. ఎన్టీఆర్ వేసిన ట్వీట్‌తో తెలుగు వారందరికీ ఈ చిత్రం దగ్గరైంది. మార్క్ కె రాబిన్‌కి అవార్డు రావడం ఆనందంగా ఉంది. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన బెన్నీకి థ్యాంక్స్. ఈ మూవీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఈ అవార్డుల్లో భాగం ఉంటుంది. తెలుగు వాళ్ల ప్రతిభను, సత్తాను చాటే చిత్రమిది. మురళీ ఈ కథని, మూవీని మా కోసమే తీశాడనిపిస్తుంది. ఈ మూవీ ఇంకా చాలా దూరం వెళ్తుందని నమ్ముతున్నాను. ఇక్కడితో ఆగే సినిమా అయితే కాదు. మున్ముందు చాలా అవార్డులు వస్తాయని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
‘ఇలాంటి అవార్డులు, గుర్తింపు వచ్చిన సమయాల్లోనే మన వద్ద ఉన్న టాలెంట్ గురించి అందరికీ తెలుస్తుంది. శివాజీ వల్లే ఈ చిత్రం ఈ స్థాయికి వచ్చింది. ఈ సినిమా చూసి ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు పర్సనల్‌గా నాకు ఫోన్ చేసి అభినందించారు. ఇలాంటి గుర్తింపు, అవార్డులు వస్తే మరింత మంచి చిత్రాల్ని, సందేశాత్మాక సినిమాల్ని తీయాలనే ప్రోత్సాహం లభిస్తుంది’ అని దర్శకుడు మురళీకాంత్ చెప్పారు. నిర్మాత రవీంద్ర బెనర్జీ మాట్లాడుతూ,’మా ‘దండోరా’ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. మా ప్రయాణంలో తోడుగా నిలిచిన సాహు, నాగవంశీకి థ్యాంక్స్’ అని తెలిపారు.
మనోళ్ళ సత్తాని చాటిన చిత్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



