‘నేను నటించిన మంచి సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయే చిత్రం ”నేనెవరు?”. దర్శకుడు చిరంజీవి ఈ కథ నాకు చెప్పినప్పుడు లిటరల్‌గా షాక్ అయ్యాను. ఇంత గొప్ప కథను కరెక్ట్‌గా తెరకెక్కించగలడా అని సందేహ పడ్డాను కూడా. కానీ షూటింగ్‌కి వెళ్ళాక, అతను ఎంత జీనియస్ అనేది అర్థం కాలేదు. నిర్మాతలు కూడా ఎంతో తపన, నిబద్ధత కలిగిన వ్యక్తులు. వాళ్ళకు ఈ చిత్రంతో ఘన విజయం సొంతం కావాలి’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన ముఖ్య పాత్ర పోషించిన చిత్రం ‘నేనెవరు?’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దసరాకు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆడియో, టీజర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కష్ణారెడ్డి, దర్శకులు వి.సముద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘నువ్వేకావాలి, ప్రేమించు’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్స్ ఫేమ్ సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రల్లో చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో తెరకెక్కిన సందేశభరిత వినోదాత్మకంగా చిత్రమిది. జై చిరంజీవ మూవీ మేకర్స్ పతాకంపై సరికొండ మల్లిఖార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు – సకినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంతో వైజాగ్ సత్యానంద్ శిష్యులు అభిలాష్, సాయిచెర్రి హీరోలుగా పరిచయమవుతున్నారు. దీపిక – సోనాక్షి, జబర్దస్త్ రాజమౌళి ఇతర పాత్రలు పోషించారు. రాజేంద్రప్రసాద్ వంటి లెజెండరీ ఆర్టిస్టుతో ఈ చిత్రం రూపొందించే అవకాశం లభించడం తమ అదష్టంగా భావిస్తున్నామని దర్శక, నిర్మాతలు అన్నారు. దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.