Saturday, May 17, 2025
Homeఆటలునితీశ్‌ కుమార్‌కు చోటు

నితీశ్‌ కుమార్‌కు చోటు

- Advertisement -

ఇంగ్లాండ్‌ టూర్‌కు
భారత్‌-ఏ జట్టు ఎంపిక

ముంబయి : ప్రతిష్టాత్మక ఇంగ్లాండ్‌ పర్యటనను టీమ్‌ ఇండియా వార్మప్‌ మ్యాచులతో మొదలెట్టనుంది. జూన్‌ 20న భారత్‌, ఇంగ్లాండ్‌ ఐదు టెస్టుల సిరీస్‌ షురూ కానుండగా తెలుగు తేజం, ఆసీస్‌ పర్యటనలో రాణించిన ఆల్‌రౌండర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డి భారత్‌-ఏ తరఫున సన్నాహక వార్మప్‌ ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచులు ఆడనున్నాడు. ఇంగ్లాండ్‌ పర్యటనలో ఇంగ్లాండ్‌ లయన్స్‌తో భారత-ఏ జట్టు రెండు వార్మప్‌ మ్యాచులు ఆడనుంది. మే 30న తొలి, జూన్‌ 6న రెండో వార్మప్‌ ఆరంభమవుతాయి. ఐపీఎల్‌18 ఫైనల్‌ అనంతరం ఇంగ్లాండ్‌కు చేరుకోనున్న భారత క్రికెటర్లు.. జూన్‌ 13-16 వరకు భారత్‌-ఏతో అంతర్గత వార్మప్‌ మ్యాచ్‌ ఆడనున్నారు. శుభ్‌మన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌లు రెండో వార్మప్‌కు అందుబాటులో ఉండనున్నారు. బీసీసీఐ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ శుక్రవారం భారత-ఏ జట్టును ఎంపిక చేయగా.. త్వరలోనే భారత సీనియర్‌ జట్టును ప్రకటించనుంది.
భారత్‌-ఏ జట్టు : అభిమన్యు ఈశ్వరన్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, కరుణ్‌ నాయర్‌, ధ్రువ్‌ జురెల్‌ (వైస్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి, శార్దుల్‌ ఠాకూర్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), మానవ్‌ సుథర్‌, తనుశ్‌ కొటియన్‌, ముకేశ్‌ కుమార్‌, ఆకాశ్‌ దీప్‌, హర్షిత్‌ రానా, అన్షుల్‌, ఖలీల్‌ అహ్మద్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, తుషార్‌ దేశ్‌పాండే, హర్ష్‌ దూబె.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -