- Advertisement -
ఆశలు ఆకాశమంతయి
ఆర్థిక అగాధాలు!
చెదిరిన కలల కలతలు
కాపురాల్లో అలకల మొలకలు!
యాంత్రికత పెరిగి
మనిషి యంత్రమై
ప్రశాంతత కరువై
ఆత్మీయతకై అన్వేషణ!
ఆనందం కౌగిట్లో
బందీ అవ్వాల్సిన బదులు
ఒకే ఇంట్లో ఉంటూ
జైలుగదుల్లోని ఖైదీల్లాగా!
మొదలు పెట్టకముందు
అది ఒక కలల గోపురం!
అదిప్పుడు కలహాల కాపురం!!
- జి.జగన్
- Advertisement -