వారిని సౌదీకి పంపే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచన
నవతెలంగాణ-మెహిదీపట్నం
మక్కాలో బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లోని నటరాజ్‌నగర్‌లో బుధవారం బాధితుల ఇండ్లకు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సౌదీలో జరిగిన ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ బిడ్డలు ప్రాణం కోల్పోవడం ఎంతో బాధాకరం అన్నారు. బాధిత కుటుంబ సభ్యులను మదీనా పంపేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కోరారు. పాస్‌పోర్ట్, వీసా తదితర ప్రాసెస్‌ను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అక్కడ 60 రోజుల్లోగా డీఎన్‌ఏ పరీక్ష పూర్తైతే బాధిత కుటుంబాలకు లక్ష రియాలు అందే అవకాశం ఉందన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేస్తూ బాధితులకు అండగా నిలవాలని చెప్పారు. డైరెక్ట్ ఫ్లైట్ బుకింగ్ విషయంలో అడ్డంకులు సృష్టించడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పొదుపు అనే పేరుతో కుటుంబాలను ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించారు. వెంటనే డైరెక్ట్ ఫ్లైట్స్ బుక్ చేసి కుటుంబాలను సౌదీ పంపించే చర్యలు తీసుకోవాలన్నారు.
మక్కా మృతుల కుటుంబాలకు కవిత పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



