నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) 14వ మహాసభలను పురస్కరించుకుని ఈ నెల 23న మహిళా సాధికారత అనే అంశంపై కవిసమ్మేళనాన్ని ఐద్వా, తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. బుధవారం ఈ మేరకు ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, తెలంగాణ సాహితీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్‌కే.సలీమా ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఐద్వా చేస్తున్న పోరాటాలను ప్రస్తావించారు. దేశంలో పదేండ్ల నుంచి మహిళలపై మతతత్వ శక్తుల దాడి పెరగడం, వివక్షలు తీవ్ర రూపం దాల్చటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఆ విధానాలను తిప్పికొట్టేందుకు, భవిష్యత్తు పోరాటాలకు సమాయత్తం అయ్యేందుకు ఐద్వా మహాసభలు దోహదపడుతాయని ఆకాంక్షించారు. మహాసభల నేపథ్యంలో మహిళలకు మరింత ఉత్సాహాన్ని, చైతన్యాన్ని అందించేందుకు మహిళా కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ సమ్మేళనంలో అతిథులుగా ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర, కాళోజి అవార్డు గ్రహీత నెల్లుట్ల రమాదేవి, ప్రముఖ రచయిత్రులు కొండేపూడి నిర్మల, గోగు శ్యామల, నస్రీన్‌ఖాన్, ఎం.రేఖ, కేంద్ర సాహిత అకాడమీ యువ పురస్కార గ్రహీత మెర్సి మార్గరేట్, ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, రూపరుక్మిణి, తదితరులు పాల్గొంటారని తెలిపారు.
23న మహిళా సాధికారతపై కవి సమ్మేళనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



