నవతెలంగాణ – ఆలేరు
యాదాద్రి భువనగిరి జిల్లా లో మేజర్ గ్రామ పంచాయతీ బీబీనగర్ మండల కేంద్రం తొమ్మిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుండి వార్డు సభ్యునిగా భరిలో నిలిచిన కట్టా వినోద్ అత్యధిక మెజారిటీ సాధించి సత్తా చాటారు. మొత్తం పద్నాల్గు వార్డులకు జరిగిన ఎన్నికల్లో అన్నీ వార్డుల కంటే అధికంగా సమీప బి ఆర్ ఎస్ అభ్యర్థి పై 243 ఓట్ల ఆధిక్యం తో గెలుపొంది రికార్డు సృష్టించారు. 351 ఓట్లు వినోద్ కు వచ్చాయి.పోలైన ఓట్లలో81.4 అధిక అత్యధిక శాతం ఓట్లు వచ్చాయి. తన ప్రత్యర్థికి 18.6 శాతంతో కేవలం 81 ఓట్లు మాత్రమే వచ్చాయి. యూత్ కాంగ్రెస్ నాయకునిగా యువతకు అనునిత్యం అందుబాటులో ఉంటూ అసాధారణ విజయాన్ని వినోద్ తన సొంతం చేసుకున్నాడు.సొంత మండలంలో అన్ని గ్రామాల వార్డ్ మెంబర్ల కంటే ఈ తరహా రికార్డు సృష్టించిన వారిలో వినోద్ ప్రధముడు ఈ యువ నాయకుని విజయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మేజర్ గ్రామ పంచాయతీలో సత్తా చాటిన “కట్ట”
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



