Sunday, March 15, 2026
E-PAPER
Homeసినిమాపవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌

పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

‘గబ్బర్‌ సింగ్‌’ వంటి సంచలన విజయం తరువాత పవన్‌ కళ్యాణ్‌, దర్శకుడు హరీష్‌ శంకర్‌ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్‌లో పవన్‌ కళ్యాణ్‌ టాప్‌ ఫామ్‌లో కనిపిస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ట్రైలర్‌ అంతటా తన ట్రేడ్‌మార్క్‌ కరిష్మాను ప్రదర్శించారు. పంచ్‌ డైలాగులు, హై వోల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు, వినోద భరితమైన క్షణాలు.. ప్రతి అంశం ప్రభావవంతంగా నిలిచి సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. దర్శకుడు హరీష్‌ శంకర్‌ మరోసారి మాస్‌ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. వెండితెరపై అభిమానులు చూడాలనుకునే విధంగా పవన్‌ కళ్యాణ్‌ను అద్భుతంగా ప్రజెంట్‌ చేయడంలో తన సత్తా నిరూపించుకున్నారు.

ట్రైలర్‌ కట్‌ చాలా షార్ప్‌గా, ఆకర్షణీయంగా ఉంది. థియేటర్లలో అభిమానులు, సినీ ప్రియులకు ఈ చిత్రం పూర్తి స్థాయి వినోద విందును అందించబోతుందనే నమ్మకాన్ని ట్రైలర్‌ కలిగించింది. రోజు రోజుకీ సినిమాపై ఆసక్తి, అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చిత్రం వెండితెరపై గుర్తుండిపోయే సినీ అనుభవాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈనెల 19వ తేదీన ఈ సినిమా థియేటర్లలో అడుగుపెట్టనుంది. పవన్‌ కళ్యాణ్‌, శ్రీలీల, రాశి ఖన్నా, పార్థిబన్‌ తదితరులు నటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -