Monday, August 4, 2025
E-PAPER
Homeదర్వాజమట్టిని పలికించిన నీటి జమిడిక

మట్టిని పలికించిన నీటి జమిడిక

- Advertisement -

డా|| నలిమెల భాస్కర్‌ రాసిన ‘చెలిమెలు’ ఈ మధ్యకాలంలో నన్ను అత్యంత ఆకర్షించినటువంటి మినీకవితలు. ఒకరకంగా ఈ ‘చెలిమెల’ కవితలన్నీ నీటి జమెడిక. నారాయణపురం లోని మట్టికి,సబ్బండ వర్గాల వత్తుల రెక్కల కష్టానికి చెల్లించిన కతజ్ఞతా వందనం. అన్ని కవితలు చదివిన తర్వాత చేను దగ్గర మక్కకంకులు కాల్చుకొని చెలిమె నీళ్ళు తాగినంత తుర్తి. ఇదంతా సద్ది తిన్న రేవును తలుచుకున్న యాది. చేమకూర
‘ప్రతి పద్య చమత్కతి’ లాగే ఈ చెలిమెల్లో కూడా ఎన్నో మెరుపులు, ఎన్నో చమత్కతులు. స్వార్ధ పూరిత మనుషులను తేటగా చేసుకొమ్మన్నట్లు ఈ మినికవితల్లోని వస్తువులు ఉన్నాయి.ఈ చెలిమెల్లో కష్టానికి ప్రధానమైన స్థానం ఉంది. ప్రతి కవితలో కతజ్ఞత భావం కొట్టొచ్చినట్లు కనబడుతుంటది.
కష్టజీవిని సంపదతో తూచాను/ లాభం లేదు/ చెమటచుక్క వేసాను/ అతను లేచాడు/ ఇదే శ్రీకష్ట తులాభారం. చెలిమెలు చదువుతుంటే అనేక భాషలు తెలిసిన భాషావేత్తగా ఆయన పదాలను ఎంత జీవంగా పలికించగలడో మనకు అర్థం అవుతుంది. ఈ చెలిమెలు చదువుతున్నపుడు నలిమెల భాస్కర్‌ సార్‌ రాసిన ‘మట్టిముత్యాలు’ స్ఫురణలోకి వచ్చాయి. ‘మట్టి ముత్యాలు’ నానీల సంపుటకి ఈ చెలిమెలు అక్క లాంటివే.
తన ‘మట్టిముత్యాలు’ నిండా భాస్కర్‌ సార్‌ ఉపాధ్యాయుడంటే సుద్దముక్క అని చెప్పిన పనితనం కనబడుతుంది. ఆ సుద్దముక్కకు ఉండే గొప్పతనాన్ని దీంట్లో కూడా చెబుతున్నప్పుడు తీరని దప్పికను తీర్చుకున్నట్లుగా నాకనిపించింది. మట్టి ముత్యాల్లోని ఒక నానీను చూస్తే- ” కొత్తిమీర ఆకులను/ ట్రిమ్‌ చేసిందెవరో / ఆ బుల్లి కత్తెరను / చూడాలి ”.
కొత్తి మీర ఆకుల సౌందర్యాన్ని చెప్పిన ఈ నానీలో కవి సూక్ష్మదష్టి, భావుకత కనబడుతుంది. నలిమెల భాస్కర్‌ గారి మట్టిముత్యాలు చదివి వాటి ప్రేరణతో 2009లో నేను ‘వడిసెల రాళ్ళు’ నానీలు తీసుకొచ్చాను.
ఫేసుబుక్కులో రాసిన ఈ చెలిమెలు కూడా మట్టి ముత్యాలు లాగే అద్భుతంగా పేలినాయి. ఈ చెలిమెలన్నీ ఇత్తనం గట్టిన దినుసే. ఎక్కడా తాలు తర్ర కనిపించలేదు. బహుజన వత్తులకు సంబంధించిన ఏ మనిషిని తాను వదిలిపెట్ట లేదు. కాపుదనపు కుటుంబం నుంచి వచ్చినవాడు కాబట్టి రైతును కొండ మీద కూర్చో బెట్టినాడు.
కవిత్వం అంటే ఏమిటో కవిత్వానికి తానిచ్చిన నిర్వచనాలు చదివితే తెలుస్తుంది . కవిత్వాన్ని ‘ అమ్మపాల తేనె వాన’ వర్ణించాడు . ఇంకా ‘ కవికి శివ్వర పుడితే శివతాండవ కవిత్వం’ కుల్ల కుల్ల చెప్పిండు.చదువే మధుపర్కం అన్నాడు.
మనిషి గొప్పతనాన్ని చెబుతూ ‘పుట్టుకతోనే మనిషోక శుభ్రనది’ అన్నాడు. బర్రెను ఒక దీపం అని ‘అది చమురుగడ్డి మేస్తుంది రోజంతా’ అని కవీత్వికరించాడు.
”బెల్లమ్ముక్క నోట వేసుకుంటే/ ఓ చెమటగడ తగిలింది/ అన్నముద్ద తినేస్తుంటే/ నా గళమే హలమారింది” అని అంటాడొక చోట. ఇట్లా చెలిమెల నిండా అనేక గొప్ప భావనలు ఉన్నాయి. ఏ మినీకవితను ముట్టుకున్నా అద్భుతమైన మట్టిపుప్పొడి మన మనసుకు అంటుకుంటుంది.
– నాగిళ్ళ రమేశ్‌, 9100482478

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -