దర్శకుడు వేణు ఉడుగుల నిర్మాతగా మారి సొంత ప్రొడక్షన్ హౌస్‌లో చేస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. 15 ఏళ్ళుగా దాచబడి ఉన్న ఓ నిజమైన కథకు రూపం ఈ సినిమా. వరంగల్-ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజమైన ప్రేమ కథ ఇది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో నిర్మిస్తున్న ఈ ప్రేమకథ ట్రైలర్ విడుదలైంది. సాయిలు కంపాటి దర్శకత్వంలో అఖిల్, తేజస్వి రావ్ జంటగా నటిస్తున్నారు. శివాజీ రాజ, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాను నిర్మాత వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ కూడా ప్రధాన భాగస్వామిగా ఉంది. ‘ఈనెల 21న విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని మేకర్స్ అన్నారు.
స్వచ్ఛమైన ప్రేమకథ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



