భయాందోళనలలో గ్రామస్తులు
నవతెలంగాణ – పెబ్బేరు
పెబ్బేరు మండలం చెలిమిళ్ళ గ్రామంలో పెళ్లూరి కృష్ణయ్య మూడో సంతానమైన పెళ్లూరు చెన్నకేశవులు ఆదివారం రాత్రి భోజనం చేసి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చి వరండాలో పరుపులు వేసుకొని పడుకున్నాడు. ఆయన ఘాఢ నిద్రలోకి వెళ్లాక.. సరిగ్గా తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో కుక్కలు అరుస్తున్న శబ్దానివిని లేచాడు. పడుకున్న పరుపులో ఏదో కదులుతున్నట్లు గ్రహించి చూడగా బుష్ , బుష్ అని శబ్దాలను వినిపిస్తున్నాయి. ఆయన పరుపు పక్కనే కొండచిలువను చూసి తీవ్ర భయాందోళన గురయ్యాడు. వెంటనే పెద్ద నాయన సాయిన్నకు తెలియజేశారు. ఆయనతోపాటు ఇంటి పక్కలో ఉన్న పెళ్లూరు మల్లేష్ కి కూడా చెప్పాడు.
దీంతో ఆయన వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న సాగర్ స్నేక్స్ సొసైటీ అధ్యక్షులు చీర్ల, కృష్ణసాగర్ కి నాలుగు గంటల సమయంలో ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే అతని శిష్య బృందాన్ని వెంటబెట్టుకొని చెలిమిళ్ళ గ్రామం కృష్ణయ్య ఇంటికి చేరుకొని ఇంటి మెట్ల కింద దాగి ఉన్న 7 ఫీట్ల పొడవు, 13 కిలోల బరువు గల కొండచిలువను ఎంతో కష్టపడి సురక్షితంగా బంధించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్బంగా కృష్ణ సాగర్ మాట్లాడుతూ.. గ్రామస్తులకు ఎవరికైనా ఎలాంటి పాములు, వన్యప్రాణులు కనబడినతే వెంటనే సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలియజేయగలరని సూచించారు. బంధించిన కొండచిలువను సురక్షితమైన అడవి ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల సమక్షంలో వదిలివేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విజయ్, సాగర్ స్నేక్స్ సొసైటీ సభ్యులు చిలుక కుమార్ సాగర్, అవినాష్ , గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇంటి వరండాలోకి వచ్చిన కొండచిలువ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES