Saturday, June 7, 2025
E-PAPER
Homeసినిమామంచి విలువలు ఉన్న అరుదైన సినిమా

మంచి విలువలు ఉన్న అరుదైన సినిమా

- Advertisement -

ప్రస్తుతం ఉన్న తరుణంలో ఓ ఫ్యామిలీ ఎమోషన్స్‌, కుటుంబ కథా చిత్రాలు, విలువలను చాటి చెప్పే కథల్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఓ సందేశాత్మక చిత్రంగా ‘షష్టిపూర్తి’ సినిమాను రూపేశ్‌ నిర్మించారు. నిర్మాతగానే కాకుండా హీరోగానూ నటించారు.
రాజేంద్ర ప్రసాద్‌, నటి అర్చన, ఆకాంక్ష సింగ్‌ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని పవన్‌ ప్రభ తెరకెక్కించారు. మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 30న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత రూపేశ్‌ మంగళవారం మీడియాతో ముచ్చటించారు.
‘షష్టిపూర్తి’ కథ నాకు చాలా నచ్చింది. ప్రస్తుతం ఇలాంటి కథలు రావడం లేదు. హింసతో కూడిన చిత్రాలే వస్తున్నాయి. ఇలాంటి విలువలతో స్క్రిప్ట్‌ నా వద్దకు రావడంతో ఎంతో ఆనందించాను. మా ఆయి ప్రొడక్షన్స్‌ అంటే.. మా అమ్మ ప్రొడక్షన్‌ అని అర్థం. అమ్మ జ్ఞాపకార్థంగానే అలా పెట్టుకున్నాను.
ఇది పూర్తిగా కల్పిత చిత్రమే. కానీ ఇందులోని పాత్రల్ని చూస్తే ఆడియెన్స్‌ మాత్రం తమని తాము చూసుకున్నట్టుగా కనెక్ట్‌ అవుతారు. ఇందులో కుటుంబ అంశాలతో పాటుగా అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించాం. ఈ చిత్రంలో అందమైన ప్రేమ కథ కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో అలాంటి ఓ సింపుల్‌, సెన్సిబుల్‌ లవ్‌స్టోరీ రాలేదు. కమర్షియల్‌ కోసం ఎలాంటి అనవసరపు అంశాల్ని జోడించలేదు. కథకు తగ్గట్టుగా ఇళయరాజా అద్భుతమైన సంగీతం, పాటలు అందించారు. యువన్‌ శంకర్‌ రాజా పాడిన ఎరోటిక్‌ సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంటుంది.
ఇళయరాజా మ్యూజిక్‌తో సినిమా స్థాయి పెరిగింది. ఆయన మాకు ఎంతో సహకరించారు. ప్రతీ పాటకు ఎన్నో ఆప్షన్స్‌ ఇచ్చారు. కీరవాణి అడిగిన వెంటనే పాట రాసి ఇచ్చారు. చైతన్య ప్రసాద్‌ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇందులోని పాటలు, ఆర్‌ఆర్‌ ఆడియెన్స్‌ను కదిలిస్తాయి.
ఈ కథ వినే పెద్ద టెక్నీషియన్స్‌ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. కథలో బలం ఉందనే ఇళయరాజా, తోట తరణి ఒప్పుకున్నారు. దానికి తగ్గట్టే మంచి అవుట్‌ పుట్‌ వచ్చింది. నేను ముందుగా ఈ ప్రాజెక్ట్‌లోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాను. అవుట్‌ పుట్‌ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను.
ఈ కథను రాజేంద్ర ప్రసాద్‌ కోసమే దర్శకుడు పవన్‌ ప్రభ రాసుకున్నారు. ఆయన కొడుకుగా నటించే వారిది కొత్త మొహం అయితే ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాను చూస్తారు. అందుకే కొత్త ఫేస్‌ కోసం దర్శకుడు చూశారు. చివరకు కొడుకుగా నేను ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. నాన్‌ థియేట్రికల్‌ ద్వారా మంచి బిజినెస్‌ జరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మా చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్‌ చేస్తున్నాం. ఇక్కడి స్పందనను చూసి ఓవర్సీస్‌లో కాస్త ఆలస్యంగా రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -