అరుదైన గౌరవం

ప్రభాస్‌ నటిస్తున్న ‘ఆదిపురుష్‌’ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. సజనాత్మక, వినోదానికి పర్యాయపదంగా నిలిచిన ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్‌లో జూన్‌ 13న ఈ సినిమా వరల్డ్‌ ప్రీమియర్‌ కానుంది. విజువల్‌ ఫీస్ట్‌గా రాబోతున్న ఈ చిత్రం తీడ్రీ ఫార్మాట్‌లో ‘మిడ్‌నైట్‌ ఆఫరింగ్‌’గా ఫెస్టివల్‌లో వీక్షకులను అలరించనుంది. జూన్‌ 16న ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే. విడుదలకు మూడు రోజుల ముందే ఈ సినిమా వరల్డ్‌ ప్రీమియర్‌లో ప్రదర్శితం కావడం పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. దీని గురించి దర్శకుడు ఓం రౌత్‌ మాట్లాడుతూ, ‘ఆదిపురుష్‌ సినిమా కాదు, ఇది ఒక ఎమోషన్‌, సెంటిమెంట్‌. ఇది భారతదేశ స్ఫూర్తితో ప్రతిధ్వనించే కథ. ట్రిబెకా ఫెస్టివల్‌లోని ఈ ప్రీమియర్‌ నిజంగా నాతో పాటు మొత్తం బందానికి సంతోషకరమైన మూమెంట్‌. ఎందుకంటే మన సంస్కతిలో బాగా పాతుకుపోయిన కథను ప్రపంచ వేదికపై ప్రదర్శించబోతున్నారు. ప్రపంచ ప్రీమియర్‌లో ప్రేక్షకుల స్పందన చూసి మేము నిజంగా థ్రిల్‌గా ఫీల్‌ అవుతాం’ అని చెప్పారు.

Spread the love