Sunday, October 5, 2025
E-PAPER
Homeకరీంనగర్కందేపికి అరుదైన జాతీయ పురస్కారం..

కందేపికి అరుదైన జాతీయ పురస్కారం..

- Advertisement -

గాంధీ ఇన్స్పీరేషనల్ జాతీయ పురస్కారం అందుకున్న రాణి ప్రసాద్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కందేపి ప్రసాద్ రావు సతీమణి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ అరుదైన జాతీయ పురస్కారం ను ఆదివారం హైదరాబాదులో అందుకున్నారు. స్వాతంత్ర అమృత్యోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని రాణీ ప్రసాద్ స్వాతంత్రానికి సంబంధించి 75 చిత్రాలను తయారు చేశారు. అందులో స్వాతంత్రోద్యమ కవితలు స్వాతంత్ర అమరవీరుల చిత్రాలు జాతీయ పతాకాలు భారతదేశ చిత్రపటాలను తయారుచేసి రెండు ఎగ్జిబిషన్ సైతం నిర్వహించారు. ఈ పురస్కారం విషయమై రాణీ ప్రసాద్ ను సంప్రదించగా తాను దక్షిణాఫ్రికాలో గాంధీజీ నివసించిన జైలును అతడు ద్వారా అనుభవించిన కష్టాలను చూసి తెలుసుకున్న విషయాలను గాంధీ ని రైలులో నుండి తెల్లదొరలు తోపివేసిన డర్బన్ రైల్వే ప్లాటు ఫారం చూసిన విషయాలను జ్ఞాపకం తెచ్చుకున్నారు. గాంధీజీ గురించి స్వాతంత్ర వీరుల గురించి చాలా రచనలు చిత్రాలు అందించిన డాక్టర్ కందేపి రాణీప్రసాద్  హైదరాబాదులో గాంధీ ఇన్స్పిరేషనల్ పురస్కారాన్ని  అందుకోవడంతో వైద్యులు వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -