Saturday, February 14, 2026
E-PAPER
HomeఆటలుT20 WORLD CUPలో ఐర్లాండ్ అరుదైన‌ రికార్డు

T20 WORLD CUPలో ఐర్లాండ్ అరుదైన‌ రికార్డు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: T20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఐర్లాండ్ భారీ స్కోర్ చేసింది. ఐదు వికెట్లు కోల్పోయి 235 ప‌రుగులు చేసింది. దీంతో టోర్నీలోనే ఐర్లాండ్ అత్యధిక స్కోర్ చేసిన జ‌ట్టుగా ఐర్లాండ్ టీం రికార్డు క్రియేట్ చేసింది. కొలంబోలోని ప్రేమ్ దాస్ స్టేడియం వేదిక‌గా ఐర్లాండ్ , ఒమెన్ టీంలు త‌ల‌ప‌డ్డాయి. టాస్ గెలిచిన‌ ఒమెన్..ఐర్లాండ్‌ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఐర్లాండ్ ఓపెన‌ర్లను స్వ‌ల్ప ప‌రుగుల‌కే ఔటైనా.. సెకండౌన్లో వ‌చ్చిన బ్యాట‌ర్లు దుమ్మురేపారు. ఎల్ జే ట్యూకర్ 51 బంతుల్లో (10 ఫోర్లు, 4 సిక్స్) 94 ర‌న్స్‌తో క‌దంతొక్కాడు. చివ‌ర వ‌ర‌కు క్రీజులో నిలిచి ఐర్లాండ్ కు అరుదైన రికార్డు స్కోర్ క‌ట్ట‌బెట్టాడు. ఈక్ర‌మంలోనే 6 ప‌రుగుల తేడాతో త్రుటిలో సెంచ‌రీ మిస్ అయ్యాడు. ఒకేవేళ అత‌ను సెంచ‌రీ న‌మోదు చేసిన‌ట్ల‌యితే టోర్నిలోనే మొద‌టి సెంచ‌రీ చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డ్ పుట్టాల్లోకి ఎక్కేవాడు. బీజే డేల‌నీ(56) అర్ధ సెంచ‌రీతో అత‌నికి తొడ్పాటు అందించాడు. ఒమెన్ బౌల‌ర్లు ష‌కీల్ అమ్మీద్ 3 వికెట్లు తీయ‌గా, షా ఫైజ‌ల్, అమీర్ క‌లీమ్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. అంత‌క‌ముందు మెగా టోర్నీలో అత్య‌ధిక స్కోర్ చేసిన జ‌ట్టుగా శ్రీ‌లంక(229) నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను ఐర్లాండ్ తిర‌గ‌రాసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -