Monday, April 13, 2026
E-PAPER
Homeసినిమాఆ వింత ఘటనలకు ప్రతిబింబం

ఆ వింత ఘటనలకు ప్రతిబింబం

- Advertisement -

నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూ హీరో కిరణ్‌ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌ పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయి తేజ్‌, వేద జలంధర్‌ హీరో, హీరోయిన్స్‌గా, వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా నుంచి ‘గోపాల గోపాల..’ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. ఈ పాటకు సనరే సాహిత్యాన్ని అందించగా, వంశీకాంత్‌ రేఖన కంపోజ్‌ చేశారు, మేఘన నాయుడు పాడారు.

‘గోకుల గోపాలక, మాధవ నారాయణ, కానగా సాధ్యమా, కలియుగ మాయ, గోకుల గోపాలక, మాధవ నారాయణ, కాలమే సాక్షిగా అలమిన మాయ, నీదు మాయే నీల వర్ణా , హాసమైనా శోకమైనా కాంతులే నిలుపవా కనుతడిన..’ అంటూ కలియుగంలో జరుగుతున్న వింత ఘటనల్ని ఆ గోవిందుడికి విన్నవిస్తూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి ఆర్ట్‌ డైరెక్టర్‌ – సుధీర్‌ మాచర్ల, డీవోపీ – అక్షయ్ రామ్‌ పొదిశెట్టి, మ్యూజిక్‌ – వంశీకాంత్‌ రేఖన, సీఈవో – రహస్య కిరణ్‌, కో ప్రొడ్యూసర్‌ – తేజ వేల్పుచర్ల, ప్రొడ్యూసర్‌ – కిరణ్‌ అబ్బవరం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -