Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeఆటలుఆసీస్‌-ఏ కు ఊరట విజయం

ఆసీస్‌-ఏ కు ఊరట విజయం

- Advertisement -

2-1తో వన్డే సిరీస్‌ భారత్‌ వశం

బ్రిస్బేన్‌ (ఆస్ట్రేలియా) : భారత్‌-ఏ, ఆస్ట్రేలియా-ఏ మహిళల వన్డే సిరీస్‌లో కంగారూ అమ్మాయిలు ఊరట విజయం దక్కించుకున్నారు. తొలి రెండు మ్యాచుల్లో గెలుపొందిన భారత్‌-ఏ 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో భారత-ఏ అమ్మాయిలు ఆశించిన ప్రదర్శన చేయలేదు. షెఫాలీ వర్మ (52, 59 బంతుల్లో 7 ఫోర్లు), యస్టికా భాటియా (42, 54 బంతుల్లో 5 ఫోర్లు) మెరిసినా.. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌-ఏ 47.4 ఓవర్లలో 216 పరుగులకు కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌-ఏ అమ్మాయిలు ఊదేశారు. 27.5 ఓవర్లలో ఓ వికెట్‌కు 222 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకున్నారు. ఓపెనర్‌ అలీసా హీలే (137 నాటౌట్‌, 85 బంతుల్లో 23 ఫోర్లు 3 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగగా.. తహ్లియ విల్సన్‌ (59, 51 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ సెంచరీతో రాణించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad