Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాదరక్షల కోసం అడుగు.. ప్రాణాల మీద పడ్డ దెబ్బ

పాదరక్షల కోసం అడుగు.. ప్రాణాల మీద పడ్డ దెబ్బ

- Advertisement -

– పాదరక్షలు తెచ్చుకుందామన్న ప్రయత్నం దురదృష్టంగా మారింది
నవతెలంగాణ – ఉప్పునుంతల
: ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన మల్కేడి శంకర్‌జీ (45) ప్రమాదవశాత్తు వాగులో మునిగి మృతిచెందాడు. శంకర్‌ శనివారం బైక్‌పై దాసర్లపల్లి నుంచి మామిళ్లపల్లి గ్రామానికి దైవదర్శనార్థం వెళ్తుండగా చిలుకల వాగు వంతెన దాటే క్రమంలో ప్రమాదం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, పాదరక్షకాలు నీటిలో కొట్టుకుపోవడంతో బైక్‌ను పక్కకు ఆపి వాటిని తీసే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో కాలుజారి లోతైన నీటిలో పడి ఈతరాకపోవడంతో అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఉప్పునుంతల తహసీల్దార్‌ సునీత, ఎస్సై వెంకట్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతునికి భార్య కవిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబాన్ని పోషించే భర్త మృతిచెందడంతో భార్య కవిత విలపించిన తీరు హృదయ విదారకంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -