Friday, December 19, 2025
E-PAPER
Homeసినిమాసంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'

సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

- Advertisement -

హీరో రవితేజ, దర్శకుడు కిషోర్‌ తిరుమల కాంబోలో సుధాకర్‌ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, పాటలు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్‌ చేయగా, తాజాగా విడుదలైన టీజర్‌ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. రవితేజ హ్యాపీ మ్యారీడ్‌ మ్యాన్‌. విదేశీ పర్యటనలో అనుకోకుండా మరొక మహిళ పట్ల ఎట్రాక్ట్‌ అవుతాడు. తర్వాత భావోద్వేగాల మధ్య నలిగిపోతూ, గైడెన్స్‌ కోసం ఒక సైకాలజిస్ట్‌ని కలుస్తాడు. తర్వాత హిలేరియస్‌ పరిస్థితులకు దారితీస్తుంది.

లైటర్‌ వెయిన్‌, భావోద్వేగభరితమైన కథలను అందించడంలో పేరుపొందిన కిషోర్‌ తిరుమల మరోసారి నవ్వులు, సహజత్వంతో కూడిన నెరేటివ్‌తో ఆకట్టుకున్నారు. రవితేజ తన బలమైన జోనర్‌ అయిన కామెడీలోకి తిరిగి వచ్చారు. గందరగోళానికి గురైన భర్త పాత్రను ఆయన అత్యంత సహజంగా పోషించారు. డింపుల్‌ హయతి ఆయన భార్యగా తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఆషికా రంగనాథ్‌ గందరగోళాన్ని సృష్టించే పాత్రలో అలరించారు. సునీల్‌ పూర్తిస్థాయి వినోదాత్మక పాత్రలో కనిపించడం మరింత ఉత్సాహాన్ని నింపింది. హ్యుమర్‌, ఆకట్టుకునే ఎమోషన్‌, వినోదంతో ఈ సంక్రాంతికి గొప్ప అనుభూతిని అందించడానికి ఈ సినిమా సిద్ధంగా ఉంది. రవితేజ మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారని టీజర్‌ చెప్పకనే చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -