Wednesday, November 5, 2025
E-PAPER
Homeజిల్లాలుహాస కొత్తూర్ వాసికి లివర్ కాన్సర్ నివారణ అంశంలో పేటెంట్ హక్కులు

హాస కొత్తూర్ వాసికి లివర్ కాన్సర్ నివారణ అంశంలో పేటెంట్ హక్కులు

- Advertisement -

భారత్, థాయిలాండ్ దేశాలలో పేటెంట్ హక్కులు

తన పరిశోధనాలతో ప్రశంసలు పొందుతున్న బాస అశోక్

నవతెలంగాణకమ్మర్ పల్లి

మండలంలోని హాసకొత్తూర్ గ్రామానికి చెందిన బాస అశోక్ కు లివర్ కాన్సర్ నివారణకు రూపొందించిన నానో కంపొసిట్ లపై మన దేశంతో పాటు థాయిలాండ్ దేశాలలో పేటెంట్ హక్కులు లభించాయి. యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో గడిచిన వంద ఏండ్లలో ఎవరికీ పేటెంట్ హక్కులు రాలేదు. హాస కొత్తూర్ కు చెందిన అశోక్ ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందడంతో ప్రశంశలు అందుతున్నాయి.

గతంలోనే థాయిలాండ్ దేశంలో పేటెంట్ హక్కులు పొందిన అశోక్, తాజగా మన భారత దేశంలోను పేటెంట్ హక్కులు పొందడంతో ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ విభాగల అధిపతులు, ప్రొఫెసర్లు ఆయనను సన్మానించి అభినందించారు. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఫిజిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న అశోక్ కు నూతన పరిశోధానలు అంటే అమిత ఆసక్తి. ఉస్మానియా యూనివర్సిటీలోనే ఎమ్మెసి ఫిజిక్స్ చేసి, అక్కడే పి.హెచ్.డి చేశారు.

ప్రేపరషన్ అండ్ క్యారెక్టరిజషన్ ఆఫ్ సమ్ పాలిమర్ గ్రీన్ కాంపౌసైట్స్ యూసింగ్ బయోఫీలర్స్ అనే అంశం లో అశోక్ గౌరవ డాక్టరేట్ పట్టా పొందారు. దేశంలో కాలేయా కాన్సర్ ఎక్కువగా ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యంలో దాని నివరించడానికి అశోక్ నానో కాంపొసిట్ టర్మరిక్ పౌడర్ విత్ ఇన్ ఎస్ ఐ టీ యూ జనరేటెడ్ మెటల్ నానోపార్టికల్స్ అనే అంశం పై పరిశోధన చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం లేబరటరీ సెల్ లైన్ స్టడీస్ ఇండికేటెడ్ ఇట్స్ ఏఫిసైన్సీ ఇన్ ఇంచిబిటింగ్, అపోపీతోసిస్ ఆఫ్ హేపీజీ 2 కాన్సర్ సెల్స్ అని, లివర్ కాన్సర్ ను నివారించేందుకు ఏంతో ఉపయోగం పడుతుందని ఈ సందర్భంగా బాస అశోక్ తెలిపారు.

ఈ అంశం విషయంలో ఇప్పటికే థాయిలాండ్ దేశంలో పేటెంట్ పొందిన అశోక్ మన దేశంలో కూడ పేటెంట్ పొందారు. రెండు దేశాలలో పేటెంట్ హక్కులు పొందడంతో యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ లు సిబ్బంది అశోక్ ను ఘనంగా సన్మానించారు. చిన్ననాటి నుండి చదువు అంటే ఆసక్తి చూపిన అశోక్ హాస కొత్తూర్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు విద్యా వాలంటీర్ గా ఫిజిక్స్ పాఠాలు చెప్పారు. ఉన్నత చదువులు చదివిన అశోక్ వివిధ అంశాలలో రాసిన ఆర్టికల్ లు అంతర్జాతీయ జర్నల్ లలో ప్రచూరణకు ఎంపికయ్యాయి. ఎందరో ఉన్నత విద్యావంతులు ఉన్నత శ్రేణి అధికారులు ఉన్న ఈ గ్రామంలోనే జన్మించిన బాస అశోక్ అదే స్థాయిలో పరిశోధనలు చేస్తూ ప్రశంశలు పొందడం పట్ల గ్రామస్తులు హార్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -