Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్కాంగ్రెస్ గ్రూప్ తగాదాలతో రచ్చకెక్కిన రోడ్డు వివాదం?     

కాంగ్రెస్ గ్రూప్ తగాదాలతో రచ్చకెక్కిన రోడ్డు వివాదం?     

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
కాంగ్రెస్ పార్టీ లో గ్రూప్ తగాదాలతో ఎడ్ బిడ్ సిసి రోడ్డు వ్యవహారం బయటకు పోక్కిన్నట్లు స్థానికంగా ప్రచారం జోరందుకుంది. ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.7 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఈ రోడ్డు నిర్మాణం చెప్పట్టిన తర్వాత బిల్లును ఆన్లైన్లో పొందుపరచాలి. అయితే  సంబంధింత పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఇవన్నీ పట్టించుకోకుండా సిసి రోడ్ నిర్మాణమైనట్లు ఆన్లైన్లో  బిల్లులు పొందుపరిచారు.

గుత్తేదారు  అధికార పార్టీకి చెందిన నాయకుడు కావటం గమనార్హం. ఈ వ్వవహారం  గ్రామంలో  పలువురు నాయకులకు తెలిసింది. అయితే ఈ సమాచారం ముందుగా అధికార పార్టీలోని ఓ నాయకుడు ద్వారా బయటకు పోక్కినట్లు స్థానికంగా ప్రచారం ఊపు అందుకుంది. ఈవిషయం గ్రామంలో ఉన్న వేరే పార్టీ నాయకులకు తెలిసింది. ఆనోటా ఈనోటా  పడటంతో గ్రామంలో అంతా పాకింది.మీడియా కు గురువారం సమాచారం అందింది. దీంతో మీడియా లో వార్తా  రావడంతో  బహిర్గతమైంది. అయితే  ఉపాధి హామీ పధకం ద్వారా ప్రతి సంవత్సరం చెప్పట్టుతున్న సి సి రోడ్డు పనుల బిల్లు లు ఆలస్యంగా వస్తున్నాయి. దీంతో బిల్లు ఆన్లైన్ లో పొందుపరిచిన తర్వాత చేద్దామన్న ఉద్దేశంతో ఈ పనులు చేయలేదని తెలుస్తోంది.ఆలస్యం జరగటం తో పాటు తమ పార్టీ లో గ్రూప్ తగలతోనే ఈ విషయం బయటకు పోక్కిందని పలువురు   అంటున్నారు. ఏది ఏమైనా ఈ వ్వవహారం  హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad