Wednesday, February 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయాలి

రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయాలి

- Advertisement -

తల్లిదండ్రులు హామీ పత్రాలివ్వాలి
ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లను విద్యార్థులకు పంపాలి : మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ప్రతివిద్యార్థి వారి తల్లిదండ్రులతో రోడ్డు నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ హామీ పత్రాన్ని ఇవ్వాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను నివారించి మరణాల సంఖ్యను తగ్గేలా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. సచివాలయంలో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. ఇది తెలంగాణలో బాధ్యతాయుతమైన రహదారి ప్రవర్తన సంస్కృతిని నిర్మించే దిశగా అడుగులేస్తున్నామని చెప్పారు. పౌరులు, తల్లిదండ్రులను రోడ్డు భద్రతకు కట్టుబడి ఉండేలా ప్రోత్సహించడం, ప్రాణాలను రక్షించడం ఉమ్మడి బాధ్యత అని అభిప్రాయపడ్డారు. సురక్షితమైన అలవాట్లు ఇంట్లోనే ప్రారంభమై ప్రతి రహదారిపై కొనసాగుతాయని గుర్తించేలా చేయడం రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు వినియోగదారులలో క్రమశిక్షణ, అవగాహన, బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించే దార్శనికతను పునరుద్ఘాటించారు. పౌరులు ట్రాఫిక్‌ నియమాలను పాటించడానికి, రోడ్డుపై ఉన్న ప్రతి జీవితాన్ని గౌరవించడానికి పౌర ప్రతిజ్ఞను తీసుకోవాలని చెప్పారు. తల్లిదండ్రుల ప్రతిజ్ఞను ఉదాహరణగా తీసుకొని, పిల్లలలో సురక్షితమైన అలవాట్లను రూపొందించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ చొరవ కుటుంబాలు, పిల్లలు, తెలంగాణలోని ప్రతి తోటి పౌరుడికి సమిష్టి వాగ్దానాన్ని గుర్తు చేస్తుందని చెప్పారు. ఇది రోడ్డు భద్రతకు ప్రభుత్వం యొక్క బలమైన సంస్థాగత నిబద్ధతను ప్రతిబింభిస్తుందని గుర్తు చేశారు. విద్యార్థులకు తల్లిదండ్రులతో ఉన్న బంధాన్ని రవాణా శాఖ రోడ్డు భద్రతకు ఉపయోగించుకోవడానికి రవాణా శాఖ రోడ్డు భద్రత ప్రతిజ్ఞ వెబ్‌సైట్‌కు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. ఈ ప్రతిజ్ఞ రాబోయే కాలంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడంతోపాటు మనుషుల ప్రాణాలను రక్షించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నామని వివరించారు. రోడ్డు నిబంధనలు పాటిస్తామని ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర అగ్రిమెంట్‌ ద్వారా విద్యార్థులతో ఉన్న వారి బంధాన్ని తెలియజేస్తాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌ రాజ్‌, రవాణా శాఖ కమిషనర్‌ ఇలంబర్తి, జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్లు చంద్రశేఖర్‌ గౌడ్‌, శివలింగయ్య, రాష్ట్ర రవాణా అథారిటీ సభ్యుడు నవీన్‌ పెట్టెం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -