Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీనియర్ నాయకుడికి రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి 

సీనియర్ నాయకుడికి రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి 

- Advertisement -

మహోబాద్ జిల్లా అధ్యక్షురాలు భూఖ్య ఉమ మురళి నాయక్ వినతి
ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తో సమావేశం 
నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు 200 మంది తరలి ఎమ్మెల్యేను జిల్లా అధ్యక్షులు కలిసిన నేతలు 
నవతెలంగాణ – నెలకుదురు 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వివిధ పదవులు చేపట్టి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డ మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లకు ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కలిసి వినతి పత్రాన్ని మండల కాంగ్రెస్ పార్టీ 200 మంది పార్టీ శ్రేణులు వినతి పత్రాలు అందించారు.

గురువారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి మండల శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ స్థానిక సర్పంచ్ పులి వెంకన్న ఆ పార్టీ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పెరుమాండ్ల గుట్టయ్య, ఆకుతోట సతీష్ మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు పార్టీ అధికారం లేనప్పుడు కూడా అండగా నిలబడి వారికి ఎన్నో సమస్యలు వచ్చిన తనపై వేసుకొని కార్యకర్తలు కాపాడిన సందర్భాలు హెచ్ వెంకటేశ్వర్లు ఉన్నాయని అన్నారు. గతంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే టికెట్టు కూడా వచ్చే అవకాశాలు ఉంటే పార్టీ అభివృద్ధి కోసం తాను పోటీలో కూడా తప్పకుండా అన్నారు. 

అంతేకాకుండా ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీ చైర్మన్ మహబూబాబాద్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గ్రామ ఉపసర్పంచ్ ఎన్ఎస్ఐ యూత్ ఇలా పార్టీలో ఎన్నో పదవులు చేపట్టి గత 30 సంవత్సరాలుగా పార్టీని కాపాడుకుంటూ జడ్పిటిసి పదవి చేసి అనుభవం ఉన్న హెచ్ వెంకటేషులకు రాష్ట్రంలో ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ మండల ప్రజలు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ను కలిసి మండల సమస్యలను వారికి విన్నవిస్తూ తనకు పదవి ఇవ్వాలని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చెందినట్లు తెలిపారు. అతనికి కార్పొరేషన్ పదవి ఇవ్వకుంటే రాబోయే రోజుల్లో పార్టీ నష్టపోయే పరిస్థితులు కూడా నెలకొని ఉంటాయని కార్యకర్తలు చెప్పినట్లు తెలిపారు.

కానీ మాజీ జెడ్పిటిసిహెచ్ వెంకటేశ్వర్లు అనే కాంగ్రెస్ పార్టీ 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి పార్టీ అధిష్టాన మేరకు ఎన్నో పదవులు ఇస్తానన్న వదులుకొని ముందుకు సాగాడు అని అన్నారు. అందుకోసం ఈరోజు తప్పకుండా అతనికి రాష్ట్రస్థాయిలో చోటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  మండల కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ . నెల్లికుదురు సర్పంచ్ పులి వెంకన్న  గ్రామ అధ్యక్షుడు రత్నపురం యాకయ్య, వివిధ గ్రామాల గ్రామ శాఖ  అధ్యక్షులు కార్యదర్శులు ఎంపీటీసీ పోరం నాయకులు కిసాన్ సెల్  పెరుమాల గుట్టయ నాయకులు తోట వెంకన్న గారు జిల్లా మాజీ ఎంపిటిసిలు సర్పంచులు గ్రామ అధ్యక్షులు వార్డు సభ్యులు బీసీ నాయకులు ఆకుదట సతీష్ మద్ది రాజేష్ రాజేష్త కుమ్మరి కుంట్ల మోనందర్ పూర్ణ బ్లాక్ ఓ బి సి నాయకులు ఆకుల నరసయ్య రత్నపురం యాకయ్య గ్రామ అధ్యక్షుడు వెంకటేష్  కృష్ణ  అనిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -