వేడుకలు పేదల మధ్య జరుపుకోవాలి
జనయేత్రీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మునీర్
నవతెలంగాణ – మిర్యాలగూడ
చిన్నప్పుడు నుంచి విద్యార్థులు సేవా భావాన్ని ఆలవర్చుకోవాలని జనయేత్రీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మునీర్ అన్నారు. శుక్రవారం ఆయన కూతురు సాదియా మహెక్ జన్మదిన వేడుకలు మండలంలోని బదురుల ఆశ్రమ పాఠశాలలో, వృద్ధాశ్రమంలో జరుపుకున్నారు. అక్కడే కట్ చేసి విద్యార్థులకు, వృద్ధులకు అన్నదానం చేశారు. విద్యార్థులకు పెన్నులు నోట్ పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న అభాగ్యులను ఆదుకోవడం తోటి వారికి సహాయం చేయడం చిన్నప్పుడు నుంచి అలవాటు చేసుకోవాల అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు అహ్మద్, కార్యదర్శి తాజ్ బాబా, కార్య నిర్వాహక అధ్యక్షులు యాదగిరి, గౌరవ సభ్యులు హైకోర్టు న్యాయవాది జాకీర్ హుస్సేన్, ఉపాధ్యాయులు నంద పుల్లయ్య శ్రీనివాసరావు పద్మజ స్వప్న, బసవరాజు రావేల, భరత్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నప్పటి నుంచే సేవాభావం అలవర్చుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



