ఇద్దరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు..
నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా జగదేవ్‌పూర్ చౌరస్తా వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయి, మరో ఇద్దరు గాయపడ్డారు. రాజస్థాన్ చెందిన ఆర్జె ఒకటి జీబీ 3628 నంబర్‌తో ఉన్న లారీ డ్రైవర్ అదుపు కోల్పోయి రోడ్డుపై ఉన్న పాన్ షాప్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సురారం, జీడిమెట్లకు చెందిన రామకృష్ణ (35) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన శిలా మామిడి సాయిలు 30 తీవ్రంగా గాయపడి చికిత్స కోసం హైదరాబాదు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
రామన్నపేట్ మండలంలోని తుమ్మలగూడెం కు చెందిన శివ అనే వ్యక్తి గాయపడ్డాడు మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించారు. మృతునితోపాటు అక్కడ ఉన్న పాన్ షాపు టీ స్టాల్ వాహనాలు నుజ్జునుజు అయ్యాయి.పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరింత సమాచారం రావలసి ఉంది. క్రేన్ సహాయంతో లారీని అక్కడి నుంచి తొలగించి రాకపోకలు ఇబ్బంది లేకుండా చూశారు
కలిచివేసిన సంఘటన.
కన్నుమూసి తెరిచే లోపల అతివేగంగా లారీ దూసుకొరావడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా, మరొకరు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఈ సంఘటనను చూసిన పలువురికి మనసులను కల్చివేసింది. గాయాల పాలైన వారు వారి బాధలు వర్ణాతితం.
వీరు ఇరువురు స్థానిక సంతోష్ నగర్ లో నిర్వహిస్తున్న ఎంగేజ్మెంట్ కు వచ్చారు,. స్వీటు కొనుగోలు కోసం జగదేవ్ పూర్ చౌరస్తాకు వచ్చారు. వారు కార్ పార్కింగ్ పెట్టి స్వీట్ తీసుకోవడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరికొందరు భయాందోళనతో అక్కడనుండి పరుగులు పెట్టారు. గజ్వేల్ నుండి భువనగిరి మీదుగా చిట్యాల కు వెళ్తున్న భారీ వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతోటో లేక నిద్ర మత్తులోనో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం.
తరచుగా ప్రమాదాలు..
జగదేవ్పూర్ చౌరస్తా వద్ద ఇటీవల సిగ్నల్ పెట్టిన తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రస్తుతం జరిగిన ప్రమాదం మాదిరిగానే గతంలో తెల్లవారుజామున మున్సిపల్ పారిశుద్ధ కార్మికురాలు రోడ్డు ఊడుస్తున్న సందర్భంలో అతివేగంగా భారీ వాహనం వచ్చి ఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది. జగదేవ్పూర్ నుండి ఈ చౌరస్తాకు వచ్చే మార్గము ఎత్తు నుండి పల్లం వైపు ఉంటుంది. సరైన సర్కిల్ లేకపోవడంతో మలుపు తిప్పడంలో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు అక్కడ అక్కడ పహారగా ఉండి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న అడప దడప ప్రమాదాలు జరుగుతున్నాయి.
నివారణ చర్యలు చేపట్టాలి..
భారీ వాహనాలు అతివేగంగా రాకుండా ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టాలి. అక్కడ వాహనాలు పట్టణంలోకి రాకుండా వేరే మార్గం ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి నివేదికలు అందజేయాలి. సర్కిల్ ను పెద్దదిగా చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి.