– అభినందనలు తెలియజేస్తున్న గ్రామస్తులు.
– ఇప్పటికే పలు ఆటల పోటీలలో పాల్గొన్న కేమ్రాజ్ కల్లాలి నవ యువకుడు
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని కేమ్రాజ్ కల్లాలి గ్రామానికి రైతు కుటుంబంలో జన్మించిన నవ యువకుడు సుంకరి రాము ఇటువంటి జరిగిన సీఎం కప్ ఆటల పోటీల్లో పలు విభాగాలలో పాల్గొని ప్రతిమ ద్వితీయ స్థానాలను సాధించాడు. చిన్ననాటి నుండి ఆటల పోటీల పైన ఎక్కువ మక్కువ చూపిన రాము అప్పటికే తండ్రి కిమ్రాజ్ కళ్యాణి మాజీ సర్పంచ్ సుంకరి వెంకటి తన కొడుకు కలను నెరవేర్చాలని ఉద్దేశంతో తర్ఫీదు నువ్వు ఇప్పించారు. అనంతరం పలు పోటీలలో రాష్ట్ర జిల్లా స్థాయిలలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం జుక్కల్ మండలంలో పెద్ద ఎడ్గి గ్రామంలో నిర్వహించిన మండల స్థాయి సీఎం కప్ ఆటల పోటీలో రాము 100 మీటర్ల రన్నింగ్ రేస్ లో పాల్గొనడం జరిగింది. ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు ముదిరాజ్ సాయినాథ్ కే హెచ్ ఓ ట్యూషనల్ లెవెల్ లో సెలెక్ట్ కావడం జరిగింది. ఇది ఆ గ్రామానికి గర్వకారణంగా చెప్పవచ్చు. ట్యూషనల్ లెవెల్ సీఎం కప్ విభాగంలో మా గ్రామానికి చెందిన వారు పాల్గొనడం మండల స్థాయిలో మా గ్రామానికి , మండలానికి మంచి పేరు సాధించి పెడతాడని గ్రామస్తులు ఆశ, నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.
జుక్కల్ మండలం మారుమూల డోన్గావ్ గ్రామంలో ఆణిముత్యం లాంటి కోచ్
జాతీయస్థాయిలో ఢిల్లీలో జరిగిన 69 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్ 14 సంవత్సరాల బాల , బాలికల జాతీయ స్థాయి రిజ్లింగ్ పోటీల్లో షిప్ 41 కిలోల విభాగంలో జాతీయస్థాయిలో హైదరాబాద్ కు చెందిన వీరాచారిని రజిత పథకం సాధించే విధంగా జుక్కల్ మండలం డోన్గావ్ గ్రామానికి చెందిన చవాన్ వినోద్ అనె యువ కోచ్ బాధ్యత తీసుకొని హైదరాబాద్ కు చెందిన వీరాచారిని తర్ఫీదునిచ్చి జాతీయస్థాయిలో ఆటల పోటీలు పాల్గొనె విధంగా ఆర్మీ సెల్లు కష్టపడి ఈ ఫీట్ ని సాధించడం వెనుక కోచ్ పాత్ర ఎంతో ప్రాముఖ్యంగా నిలిచింది.
ఇటీవల జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్ 14 ఇయర్స్ బాల , బాలికల రెజ్లింగ్ విభాగంలో తన ఏకలవ్య శిష్యుని జాతీయస్థాయిలో మెరుపు మెరుపించాడు. తన శిష్యుడు రజిత పథకం సాధించే విధంగా ఎంతగానో కృషి చేసిన జుక్కల్ మండలం డోన్గావ్ గిరిజన తండా గ్రామవాసి కావడం జుక్కల్ మండలానికి ఎంతో గర్వకారణంగా ఉంది. పోటీల అనంతరం గ్రామానికి తిరిగి వస్తున్న కోచ్ చవాన్ వినోద్ ను గ్రామస్తులు సన్మానించేందుకు సన్నాహా కార్యక్రమం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఫోన్ ద్వారా అతని రాక కొరకు ఆరా తీస్తున్నారు. రాగానే ఘనంగా స్వాగతించాలని ఏర్పాట్లను చేస్తున్నారు.
జాతీయస్థాయిలో కోచిగా తమ విధులు విజయవంతంగా నిర్వహించినందుకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ హిరాలాల్ కోచ్ చవాన్ వినోద్ , హిమబిందు , ప్రవీణ్ లను సత్కరించారు. మారుమూల ప్రాంత గ్రామ గిరిజన వాసి అయిన చవాన్ వినోద్ పూర్తిగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నిరుపేద వ్యక్తి కావడం ఇంటింటై వటిడింతై అన్నట్టుగా కటిక బీదరికం నుండి గొప్ప కోచ్ గా అవతరించడం చాలా సంతోషిదాయకంగా ఉందని జుక్కల్ మండల్ వాసులు , ప్రజా ప్రతినిధులు , యువకులు , మహిళలు , గ్రామ పెద్దలు, తదితరులు గర్విస్తున్నారు.



