– తల్లి కండ్ల ముందే ప్రాణం కోల్పోయిన చిన్నారి
– పాఠశాలకు వెళ్తుండగా ఘటన
నవతెలంగాణ-జవహర్‌నగర్
తల్లితో కలిసి స్కూటీపై పాఠశాలకు బయలుదేరిన బాలున్ని ఆర్మీ ట్రక్ బలిగొంది. తల్లి కండ్ల ముందే కొడుకు ప్రాణం కోల్పోయిన ఈ విషాద ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే పురం ఫ్లైఓవర్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీ ఆఫీసర్ కాలనీలో నివాసం ఉంటున్న నీలాంగ్ తమంగ్ తన కొడుకు నీజెన్ తమంగ్(8)ను బుధవారం ఉదయం ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో విడిచిపెట్టి రావడానికి స్కూటీపై బయల్దేరింది. ఈ క్రమంలో ఆర్కేపురం ఫ్లైఓవర్ వద్ద స్కూటీ స్కిడ్ కావడంతో ఇద్దరూ కింద పడిపోయారు. అదే సమయంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన ట్రక్ స్కూటీపై నుంచి వెళ్లడంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లికి తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆర్మీ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. బాలుడి తండ్రి సంగమ్ తమంగ్ జమ్ముకాశ్మీర్‌లో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నీలాంగ్ మామ తప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్మీ ట్రక్ ఢీకొని జవాన్ కొడుకు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



