Sunday, April 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం13 ఏండ్ల భూసమస్యకు పరిష్కారం

13 ఏండ్ల భూసమస్యకు పరిష్కారం

- Advertisement -

– గిరిజన రైతులకు పట్టాల పంపిణీ
– ఆనందంలో రైతులు.. కలెక్టర్‌ను సన్మానించి కృతజ్ఞతలు
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌

ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం పల్సి(బి) తండాకు చెందిన గిరిజన రైతులు 13 ఏండ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. పెండింగ్‌లో ఉన్న భూసమస్య తీరిపోయింది. జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా ప్రత్యేక చొరవతో సమస్యను వేగంగా పరిష్కరించి రైతులకు పట్టాలు అందజేయడంతో హర్షం వ్యక్తమవుతోంది. ఫారెస్ట్‌, రెవెన్యూ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు, సర్వే నంబర్లలో ఉన్న సాంకేతిక సమస్యల కారణంగా పల్సి(బి) తండాకు చెందిన సుమారు 9 మంది ఎస్టీ రైతులు దశాబ్దకాలంగా పట్టాలు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ప్రభుత్వ పథకాల ప్రయోజ నాలు పొందడంలోనూ వారు వెనుకబడ్డారు. రైతులు తమ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగానే ఆయన సీసీఎల్‌ఏ అధికారులతో సమన్వయం చేసి పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్‌ పర్యవేక్షణలో రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టి సమస్యను కొలిక్కి తెచ్చింది. ఈ పరిష్కారంలో భాగంగా మొత్తం 30 ఎకరాల భూమిని అర్హులైన రైతులకు కేటాయించారు. 9 మంది రైతులకు వారి సాగు విస్తీర్ణం ఆధారంగా 2 నుంచి 3 ఎకరాల వరకు పట్టాలను కలెక్టర్‌ స్వయంగా అందజేశారు. పట్టాలు అందుకున్న రైతులు శనివారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమం లో కలెక్టర్‌ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. తమ దీర్ఘకాల సమస్యను పరిష్కరించినందుకు ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, తహసీల్దార్‌ రాజ్‌మోహన్‌, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -