బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ చిత్రం ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ మరో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌గా ‘జాజికాయ’ అంటూ సాగే మాస్ డ్యాన్స్ నెంబర్ రిలీజ్ అయింది. ఈ పాటను లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ అత్యద్భుతమైన క్యాచీ లిరిక్స్‌తో రాయగా, సింగర్స్ శ్రేయాఘోషల్, బ్రిజేష్ శాండిల్యా ఎంతో ఎనర్జిటిక్‌గా పాడారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ థియేటర్స్ దద్దరిల్లేలా పాటని కంపోజ్ చేశారు. గ్రాండ్ సెట్‌లో చిత్రీకరణ చేసిన ఈ సాంగ్‌లో బాలకృష్ణ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్‌ని అద్భుతంగా అలరించనున్నాయి. భాను మాస్టర్ కంపోజ్ చేసిన మూమెంట్స్ సూపర్‌గా ఉన్నాయి అని చిత్ర యూనిట్ తెలిపింది.
వైజాగ్‌లోని జగదాంబ థియేటర్‌లో గ్రాండ్‌గా జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో బాలకృష్ణతో పాటు డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త తదితరులు హాజరై ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.
బాలకృష్ణ మాట్లాడుతూ, ”అఖండ’ ఫస్ట్ పార్ట్ మన దగ్గర ఎంత పెద్ద హిట్ అయిందో చూశారు. ఇప్పుడు సీక్వెల్ ‘అఖండ: తాండవం’ పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ కాబోతోంది. కోవిడ్ టైమ్‌లోనే ‘అఖండ’ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా ఇచ్చిన ధైర్యంతో మిగతా సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు రిలీజ్ అయిన పాట ఐటమ్ సాంగ్ కాదు. కుటుంబం పండగ చేసుకునే నేపథ్యంలో వచ్చే సాంగ్. పాటలో సంయుక్తను చూశారు కదా.. ఆమె ఎంతో అందంగా ఉంది. సినిమాలో ఆమె నటన కూడా చూస్తారు. ఆమె హావభావాలు ఎంతో అద్భుతంగా పలికించి, తన పాత్రకు న్యాయం చేసింది’ అని తెలిపారు. ‘ఈ సాంగ్ ఎలా ఉందో చూశారు కదా.. సాంగ్‌లో ఇంకో పార్శాన్ని కూడా చూస్తారు. ఈ సాంగ్ ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక్క మాస్ సాంగ్. సినిమాలో అనంతపూర్‌లో జరిగే బర్త్ డే పార్టీలో వచ్చే పాట ఇది. సంయుక్త మీనన్ చేసిన ఫస్ట్ మాస్ సాంగ్ ఇది. ఈ సాంగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. డిసెంబర్ 5న విడుదలయ్యే సినిమాను కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు’ అని డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పారు.
మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే పాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



