Sunday, March 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅలాంటి వారికి నచ్చే పాట

అలాంటి వారికి నచ్చే పాట

- Advertisement -

‘కమిటీ కుర్రోళ్లు’ వంటి ఘన విజయం సాధించిన చిత్రం తరువాత నటి, నిర్మాత నిహారిక కొణిదెల జీ స్టూడియోస్‌ సమర్పణలో తన పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఉమేష్‌ కుమార్‌ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్‌ శోభన్‌, నయన్‌ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 3న రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ క్రమంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ని చిత్రయూనిట్‌ ప్రారంభించింది. ఈ సందర్భంగా ‘పదే పదే’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను సెయింట్‌ పీటర్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో రిలీజ్‌ చేశారు. ఈ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల మాట్లాడుతూ, ”మా ‘పదే పదే’ సాంగ్‌ని కాకుండా సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఈ కాలేజ్‌లో పెడితే బాగుండనిపిస్తోంది.

మనం ప్రేమ గురించి ఎప్పుడూ ప్రాధేయ పడకూడదు. మనమే ప్రేమలా మారిపోవాలి. అదే మా ఈ ‘పదే పదే’ పాట. ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. ఏప్రిల్‌ 3న మా మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. ‘అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్‌ కామెడీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది. ‘రపప్పా.. రపప్పా’ బ్లాక్‌ బస్టర్‌ తరువాత ‘పదే పదే’ పాట వచ్చింది. ఈ పాట కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌, గర్ల్స్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఈ పాట అద్భుతంగా ఉంటుంది’ అని సంగీత్‌ శోభన్‌ చెప్పారు. నయన్‌ సారిక మాట్లాడుతూ,’గర్ల్స్‌ ఎక్కువగా ఏదీ కూడా బయటకు ఎక్స్‌ప్రెస్‌ చేయరు. అలాంటి వారికి ఈ పాట చాలా నచ్చుతుంది. పాట మాదిరిగానే సినిమా కూడా అందర్నీ కచ్చితంగా అలరిస్తుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -