Sunday, November 9, 2025
E-PAPER
Homeసినిమాఒక రోజులో జరిగే కథ..

ఒక రోజులో జరిగే కథ..

- Advertisement -

చిత్రాలయం స్టూడియోస్‌ పై నిర్మాత వేణు దోనేపూడి నిర్మిస్తున్న క్రైమ్‌ కామెడీ సినిమా ‘బా బా బ్లాక్‌ షీప్‌’. ప్రస్తుతం మేఘాలయలో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంతో గుణి మంచికంటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
టిన్ను ఆనంద్‌, ఉపేంద్ర లిమయే, జార్జ్‌ మరియన్‌, రాజా రవీంద్ర, అక్షరు లఘుసాని, విష్ణు ఓ అరు, కార్తికేయ దేవ్‌, కశ్యప్‌, విస్మయ, మాల్వి మల్హోత్రా, సమద్ధి ఆర్యల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ, ‘మేఘాలయలో సంపూర్ణంగా షూటింగ్‌ జరుపుకుంటున్న తొలి సినిమా మాదే కావడం ఆనందంగా ఉంది. కథ మొత్తం నార్త్‌ ఈస్ట్‌ ఇండియాలో సాగుతుంది కాబట్టి, ఇక్కడే చిత్రీకరిస్తున్నాం. కథలోనే ఓ బ్యూటీ ఉంటుంది. జలపాతాలు, కొండలు, అందమైన ప్రదేశాల్లో ఈ కథ ఉంటుంది. ఒక రోజులో జరిగే కథతో తెరకెక్కుతోందీ సినిమా. ఆరుగురి మధ్య సాగే ఇంట్రస్టింగ్‌ స్టోరీ ఇది. గన్స్‌, గోల్డ్‌, హంట్‌ అంటూ ఆసక్తికరంగా ఉంటుంది. ఎప్పుడూ వర్షం కురుస్తూ ఉండే సోహ్రా (చిరపుంజి)లో షూటింగ్‌ చేయడం చాలా కష్టమైన వ్యవహారం. కానీ, అన్నిటినీ అధిగమించి మా టీమ్‌ ఎంతో కషి చేస్తున్నారు. తప్పకుండా మన ప్రేక్షకులకు కనువిందు చేసే సినిమా అవుతుంది’ అని అన్నారు. చిత్రాలయం స్టూడియోస్‌ ఈ సినిమా కోసం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్‌ కె సంగ్మా ఇటీవల సినిమా యూనిట్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మేఘాలయలో షూటింగ్‌ కోసం తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -